స్వచ్ఛభారత్‌ బ్రాండ్‌ అంబాసిడర్లతో వెంకయ్య చర్చ

1
హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి):: మహాత్మా గాంధీ స్పూర్తితో ప్రధాని మోదీ స్వచ్ఛభారత్‌ను

ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదని, ఇదో స్వచ్ఛంద కార్యక్రమమని అన్నారు. సోమవారం ఉదయం స్వచ్ఛభారత్‌కు ప్రచారకార్యకర్తలుగా ఎంపికైన వారితో వెంకయ్య సమావేశమయ్యారు. కేవలం ప్రభుత్వంతో మాత్రమే స్వచ్ఛభారత్‌ సాధ్యంకాదని, ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా సాధించగలమని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి 18 మందిని స్వచ్ఛభారత్‌ దూతలుగా ఆహ్వానిస్తున్నామని ఆయన వెల్లడించారు. సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ స్వచ్ఛభారత్‌లో పాల్గొంటారని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక గురువులు, సినీ ప్రముఖులు అందిరితో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఇందులో ఎంపిక చేసిన వారు తమతయమ ప్రాంతాల్లో స్వచ్ఛభారత్‌కు ప్రచారం చేసి సమాజంలో చైతన్యం తీసుకుని వస్తారని అన్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ ప్రచారకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ రాజకీయ కార్యక్రమం కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పరిశుభ్రత లేమితో ప్రతి పేదవాడిపై ఏడాదికి రూ.6500 భారం పడుతుందని అన్నారు. స్వచ్ఛభారత్‌కు విూడియా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వ్యాపార, సేవా సంస్థలు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇదిలావుంటే స్వచ్ఛభారత్‌ కోసం అందరూ కృషి చేయాలని సమావేశంలో పాల్గొన్న ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. స్వచ్ఛభారత్‌కు అవగాహన, మౌలిక వసతులు, చట్టబద్ధత అవసరమని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌ కోసం ప్రచారకర్తలతో కలిసి పనిచేస్తామని అన్నారు. స్వచ్ఛభారత్‌ కోసం అందరూ కృషి చేయాలనిఅన్నారు. స్వచ్ఛభారత్‌కు అవగాహన, మౌలిక వసతులు, చట్టబద్ధత అవసరమని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌ కోసం ప్రచారకర్తలతో కలిసి పనిచేస్తామని అన్నారు. స్వచ్ఛభారత్‌ ఆవశ్యకతను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట రూపంలో పాడి వివరించారు. స్వచ్ఛభారత్‌ ప్రచారకర్తలతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నిర్వహించిన సమావేశంలో బాలు పాల్గొన్నారు. స్వచ్ఛభారత్‌పై ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా బాలు గానం సాగింది. తనకున్న అవకాశాల మేరకు ఈటీవీ పాడుతా తీయగా ద్వారా దీనిని మరింతగా ముందుకు తీసుకుని వెళతానన్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నిజామాబాద్‌ ఎంపీ కవిత కోరారు. స్వచ్ఛభారత్‌ ప్రచారకర్తలతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నిర్వహించిన సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్‌ భారత్‌లో అందరూ పొల్గొనాలని  పిలుపునిచ్చారు. స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణను స్వచ్ఛందంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇండియాను ప్రపంచంలోనే స్వచ్ఛమైన దేశంగా తీర్చిదిద్దాలన్నారు. ఎంపీ కవిత కూడా  స్వచ్ఛ్‌ భారత్‌ ప్రచారకర్తగా ఎంపికయ్యారు. ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న పుల్లెల గోపీచంద్‌, క్రికెటర్‌ లక్ష్మణ్‌, కోనేరు హంపి,జెఎ చౌదరి తదితరులు మాట్లాడారు. తమవంతుగా సామాజిక బాధ్యతగా దీనిని ముందుకు తీసుకుని వెళతామన్నారు. ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ల్రో  ప్రచారం చేసేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకుగాను ఒక్కో రాష్ట్రం నుంచి 9 మంది చొప్పున ప్రముఖులను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం నామినేట్‌ చేసారు. వీరిలో.. సినిమా రంగం నుంచి గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పవన్‌ కల్యాణ్‌, నితిన్‌, సుద్దాల అశోక్‌ తేజ, అమల నాగార్జున వంటివారు ఉన్నారు. తెలుగు విూడియా రంగం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ – ‘ఏబీఎన్‌’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఉన్నారు.  ఎంపీలు.. కె కవిత (టీఆర్‌ఎస్‌), గల్లా జయదేవ్‌ (టీడీపీ), క్రీడారంగం నుంచి వీవీఎస్‌ లక్ష్మణ్‌ (క్రికెటర్‌), శివలాల్‌ యాదవ్‌ (బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు), పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ కోచ్‌), కోనేరు హంపి (చెస్‌ క్రీడాకారిణి), పారిశ్రామిక రంగం నుంచి బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, జేఏ చౌదరి, జే రామేశ్వరరావు, జీవీకే రెడ్డి, వైద్య రంగం నుంచి డాక్టర్‌ గోపీ చంద్‌, డాక్టర్‌ జీఎస్‌ రావులు ఉన్నారు.