స్వచ్ఛ అల్వాల్ కు ప్రజలందరూ సహకరించాలి ఏ ఎం హెచ్ ఓ మంజుల

అల్వాల్ మున్సిపల్ పరిధిలో  స్వచ్ఛ అల్వాల్ కు  అన్ని వర్గాల ప్రజలు సహకరించాలనిఅల్వాల్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఏ ఎం హెచ్ ఓ మంజుల  కోరారు. బుధవారం వెంకటాపురం డివిజన్ పరిధిలోని  భూదేవి నగర్ నుండి  సాయి బృందావన్ కాలనీ వరకు  రైల్వే ట్రాక్ వెంట ఉన్న  పాలమూరు గుడిసెల వాసుల ప్రాంతంతో స్థానిక కాలనీవాసులు అభ్యర్థన మేరకు  సానిటరీ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. రోడ్డుపై ఉన్న  డ్రమ్ములో బకెట్లను  వెంటనే తొలగించాలని ఇంటి చెత్తనుఇతర వ్యర్థాలను చుట్టుపక్కల పడవేయకుండా  తప్పనిసరిగా స్వచ్ఛ ఆటో లకి ఇవ్వాలనిలేనిచో చుట్టుపక్కల చెత్త అపరిశుద్ధంగా ఉండడం కారణంగా  దోమలు ఉత్పత్తి అయి ప్రజలకు అన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ప్రధానంగా ఇండ్ల ముందు వాడుతున్న  నీటిని వదలరాదని  అలా వదలడంవల్ల రోడ్డుపై నీరు ప్రవహించివాహనదారులకురాకపోకలకు  ఇబ్బందికలుగుతుందనిప్రజలనుండే మున్సిపాలిటీకి  ఫిర్యాదులు అందాయని వివరించారు. ప్రతి ఒక్కరు నీటిని వారు నివాసం ఉంటున్న  గుడిసె పరిధిలోనే  వాడుకోవాలనివారి వాడకం నీటిని  రోడ్డుపై వదలరాదని ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు  సహకరించాలని కోరారు. దీనితోపాటుగా  మైకుల ద్వారా  రైల్వే ట్రాక్ వెంట ఉన్న గుడిసే వాసులందరికీ  ప్రచారం చేశారు. మున్సిపల్ హెల్త్ అధికారిని మంజుల తో పాటు సానిటరీ సూపెర్డెంట్  ప్రభాకర్, సానిటరీ ఇన్స్పెక్టర్  లు  దాసరి పద్మారావు, తిరుపతి, జహంగీర్ , బాబురావు, మహేందర్ లు పర్యవేక్షణలో పాల్గొన్నారు

తాజావార్తలు