స్వచ్ఛ గురుకులం కార్యక్రమంలో పాల్గొన్న తహసిల్దార్

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది:తహసిల్దార్ చందా నరేష్

కొత్తగూడ సెప్టెంబర్ 9 జనంసాక్షి:పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ గురుకులం కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.విద్యార్థులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో ఈ నెల 5 నుంచి వారం రోజులపాటు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులువిద్యార్థులు,తల్లిదండ్రులు,స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారుల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో గ్రీన్‌ స్కూల్ డ్రైవ్‌ డే,ఇన్నోవేటివ్‌ ప్లాంటేషన్‌ డ్రైవ్‌ ను స్థానిక తహసీల్దార్ చందా నరేష్,గురుకుల ప్రిన్సిపాల్ విజయ లు పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు.ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ పాఠశాల ఆవరణం,తరగతి గదులు పరిశుభ్రంగా ఉండాలని,విద్యార్థులు భోజనానికి ముందు చేతులు శుభ్రపరచుకునేలా అవగాహన కల్పించాలన్నారు.నాటిన మొక్కలను సంరక్షించడం మనందరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు