స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం రెడీనా!

ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుకు సవాల్ విసిరిన డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట ఆర్సీ ,23 జులై,( జనం సాక్షి న్యూస్) : స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇటీవలే డిండి చింతపల్లి లో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అమ్రాబాద్ లో డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిండి చింతపల్లి ప్రెస్ మీట్ లో స్థానిక ఎమ్మెల్యేగువ్వలబాలరాజు తనపై అనుచిత మైన తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ఈజీఎస్ పనుల్లో దారిద్ర రేఖకు దిగువలేని అనర్హులు ఒక గ్రామంలో జాబ్ కార్డు ఉంటే మరోగ్రామంలో పనులు చేస్తూ అవకతవకలు జరిగాయని ఇదే విషయమై ఈజీఎస్ పిడి తో మాట్లాడా నని, లింగాల సర్పంచ్ నాలుగు కోట్ల రూపాయల అవినీతి పై స్టేట్ లెవెల్ సోషల్ ఆడిట్ వారు జిల్లా కలెక్టర్ కు రిపోర్ట్ ఇచ్చారని కానీ అరెస్టు కాకుండా ఎమ్మెల్యే అడ్డు పడి కాపాడుతున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.నేను భూస్వాములకు ఉపాధి హామీ పథకం కింద పనులు ఇవ్వొద్దని చెప్పాను కానీ భూస్వాములు ఉండొద్దని చెప్పలేదని దీనిని వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. నేను ఎంట్రన్స్ రాసి ఎంబిబిఎస్, ఎమ్మెస్ చదివి ప్రజలకు వేయిల సంఖ్యలో శస్త్ర చికిత్సలు వైద్య సేవలు అందించాను,నీవు ఐదు జన్మలు ఎత్తిన నాలాగా డాక్టర్ కాలేవని, నీవు డబ్బులు ఇస్తే ఇచ్చే డాక్టరేట్ సెర్ట్ఫికెట్ ద్వారా డాక్టర్ అవుతావేమో అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే మాటలు ఎల్ కేజీ విద్యార్థి ల ఉన్నాయని, గౌరవమైన ఎమ్మెల్యే పదవికి కళంకితం తెస్తున్నాడని అన్నారు.నా వ్యక్తిత్వం, పైన దిగజారి మాట్లాడితే ఖబడ్దార్ అని మండిపడ్డారు. వికలాంగుడిని, ఎమ్మెల్యే ని ,ఫారెస్ట్ అధికారిని కొట్టావు, ఉద్యమం పేరుతో వలస వచ్చిన గంజి లేదని చెప్పిన నీకు బెంజి ఎలా వచ్చిందో,వందల కోట్లు ఎలా సంపాదించావో ప్రజలకు చెప్పాలని అన్నారు.కనకాల మైసమ్మ దగ్గర దళితుల భూములను గుంజుకున్నా వు,శనగ కుంట చెరువు వద్ద ముప్పై ఎకరాల భూమిని ఇద్దరి మధ్య పంచాయితీ గొడవలో ఇద్దరిని భేదిరించి అగ్గువ రేటుకు కొన్నావు, నా హయాంలో ఈజిఎస్ లో ఒక్క శాతం అవినీతి నిరూపిస్తే చేస్తే రాజకీయమే చేయనని సవాల్ విసిరారు. నల్లమల లో రాయలగండి, బౌరపూర్, ప్రతాప రుద్రుని కోట లలో గుప్త నిధుల కోసం గుంతలు తవ్వుకుంటోంది నీవెనని,లింగాల లో పోషమ్మ, శివాలయం గుళ్లలో నీ అనుచరులు తవ్వకాలు చేసారని, మరోపక్క ఇసుక మాఫియా, చెరువు కబ్జాలు, చేస్తూ ఈజీఎస్ ను వదలడం లేదని అన్నారు. గెలుపు ఓటములు అతీతంగా ప్రజలకు కొరకై పనిచేస్తున్నాని, టీఆరెస్ పార్టీ లోకి నన్ను ఆహ్వానించి న సిద్ధాంతం కోసం కట్టుబడి ఆత్మాభిమానం తో గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాలలో నిలబడ్డానని ,నీలాగా వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి కెవిపి రామచంద్రరావు కాళ్ళ మీద పడ్డావు నీవు ఇది నువ్వు గుర్తు చేసుకో అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఏ మండలంలో అయినా నేను అభివృద్ధి చేసిన దాంట్లో కనీసం 10 శాతం చేసినట్లు నిరూపించాలన్నారు. నల్లమల్ల ముద్దుబిడ్డవు కాదు అద్దే బిడ్డవు నీవు , నీ అధికారం పోయిన రోజు నీ పరిస్థితి జీరో అవుతుంది, ధన బలం,పోలీసుల బలంతో నువ్వు చేస్తున్న అరాచకాలకు ప్రజా క్షేత్రం లో తగిన గుణపాఠంచెబుతాము అన్నారు. నేను ఇక్కడే పుట్ట్టి,పెరిగాను నేను చనిపోతే కూడా ఇక్కడే పూడుస్తారు అన్నారు. ఇద్దరము ఏ పార్టీ తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుదామని దీనికి నీవు సిద్ధమని సవాల్ విసిరారు. స్వతంత్ర అభ్యర్థిగా నువ్వు దిగితే కనీసం నీకు డిపాజిట్ కూడా రాదని అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే,స్వర్గీయ పుట్ట పాగా మహేంద్ర నాథ్ ను ఆదర్శంగా తీసుకొని రాజకీయాలలోకి వచ్చాను అన్నారు. కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ పోచం గణేష్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్చిరెడ్డి, బాల్ లింగం గౌడ్, రేనయ్య, హరి నారాయణ , సింగల్ విండో డైరెక్టర్లు జగన్ యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు