స్వదేశానికి చేరిన సరబ్‌జిత్ మృతదేహం
రాహుల్, షిండే పరామర్శ ధీర బిడ్డను కోల్పోయాం : ప్రధాని
రెండు దేశాల పౌర సంబంధాలు దెబ్బతిన్నాయి : ఖుర్షీద్
రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా
నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
లాహోర్/న్యూఢిల్లీ, మే 2 (జనంసాక్షి) :
పాకిస్థాన్‌లోని లాహోర్ జైలులో తోటి ఖైదీల పాశవికదాడిలో గాయపడి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతిచెందిన భారతీయ ఖైదీ సరబ్‌జిత్‌సింగ్ మృతదేహాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం గురువారం భారత్‌కు అప్పగించింది. భారత హైకమిషన్‌కు చెందిన ఇద్దరు అధికారుల సారథ్యంలోని బృందం సరబ్‌జిత్ మృతదేహాన్ని వుంచిన శవపేటికను తీసుకొని భారత్‌కు వచ్చింది. అంతకు ముందు లా¬ర్‌లోని జిన్నా ఆసుపత్రిలో సరబ్‌జిత్‌సింగ్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. సరబ్ మృతదేహం తరలింపు సందర్భంగా ఆసుపత్రి నుంచి విమానాశ్రయం వరకు పోలీసు బలగాలతో గట్టిభద్రతను ఏర్పాటుచేశారు. లా¬ర్ విమానాశ్రయం నుంచి ప్రత్యేకవిమానంలో సరబ్‌జిత్ మృతదేహాన్ని భారత్‌లోని పంజాబ్‌రాష్ట్రంలోని ఆయన స్వగ్రామమైన భిఖివిండ్‌కు తీసుకు వచ్చారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు పాకిస్థాన్‌లో మరణించిన భారతీయుడు సరబ్‌జిత్‌సింగ్ మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రత్యేక విమానం పాకిస్థాన్‌కు బయల్దేరింది. సరబ్‌జిత్ సింగ్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సహాయనిధినుంచి రూ. 25 లక్షలు పరిహారం ప్రకటించింది. ఇదిలావుంటే తన సోదరుడిని మిగతా 2లోచెందిన మానవహక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ రూ. 25 కోట్లిస్తే సరబ్‌ని విడుదల చేయిస్తానన్నారని దల్బీర్ చెప్పారు. కనీసం రెండు కోట్లిచ్చినా సాయంత్రానికల్లా సరబ్‌ని విడుదల చేయిస్తానని బర్నీ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. తాము పేదవాళ్లం కావడంతో అంత డబ్బు ఇవ్వలేకపోయామన్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చే వారికి వీసాలివ్వవద్దని తాను ¬ంమంత్రిని కోరినట్లు కూడా ఆమె చెప్పారు.
సరబ్‌జిత్ హంతకులను శిక్షిస్తాం : నజమ్‌సేథీ
లాహర్‌లోని కోట్‌లక్‌పత్ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న భారతీయుడు సరబ్‌జిత్‌సింగ్‌పై దాడి చేసిన వారిని శిక్షిస్తామని పాక్‌లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నజమ్‌సేధీ అన్నారు. దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామన్నారు.
ప్రధాని విచారం
పాకిస్థాన్‌లో సరబ్‌జిత్‌సింగ్ మృతిపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సరబ్ భరతమాత ధీర బిడ్డ అంటూ నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సరబ్‌జిత్ మృతికి బాధ్యులైన వారిపై న్యాయ చర్యలు తీసుకోవాలని ఆయన పాకిస్థాన్‌ను డిమాండ్ చేశారు. సరబ్‌ను విడుదల చేయాలంటూ భారత ప్రభుత్వం సరబ్ కుటుంబం దేశంలోని పౌర సమాజం చేసిన విజ్ఞప్తులను పాకిస్థాన్ పట్టించుకోకపోవడం విచారకరమని ప్రధాని అన్నారు. సరబ్ విషయాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరినా పాకిస్థాన్ పెడచెవిన పెట్టిందని అన్నారు. జీవితంలో సర్వస్వం కోల్పోయిన సరబ్ ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు. ఆయన మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయన కుటుంబంతో సంప్రదించి అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. దేశం యావత్తూ ఈ దు:ఖసమయంలో సరబ్ కుటుంబం వెంట ఉంటుందని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సరబ్‌జిత్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాదాపు 40 నిముషాలపాటు రాహుల్ సరబ్‌జిత్ ఇంట్లో గడిపారు. సరబ్‌జిత్ మృతిపట్ల అతని సోదరి, భార్య, కుమార్తెలకు రాహుల్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సరబ్ మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రధానితో సమావేశమయ్యారు. సరబ్ మృతిపై ఆయనకు వివరించారు.
కుటుంబానికి హోం మంత్రి పరామర్శ
సరబ్‌జిత్‌సింగ్ కుటుంబ సభ్యులను కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరబ్‌జిత్ మృతి అత్యంత విషాదకరమైన సంఘటనగా పేర్కొన్నారు. సరబ్‌జిత్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడం కోసం విదేశాంగ శాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. సరబ్‌జిత్ కుటుంబానికి న్యాయం చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కాగా సరబ్‌జిత్‌సింగ్ మృతదేహాన్ని భారత్‌కు అప్పగించేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. శవపరీక్ష అనంతరం భారత హైకమిషనర్ కార్యాలయానికి సరబ్‌జిత్ మృతదేహాన్ని అప్పగించనున్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ సెక్రటరీ అజిత్‌షేత్ మాట్లాడుతూ సరబ్ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకువస్తున్నామని చెప్పారు. సరబ్ మృతిపై భిన్న కథనాల నేపథ్యంలో పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ సరబ్ గుండె పోటుతో మరణించారని పేర్కొంది.
ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు భావిస్తున్నాం : మనీష్
సరబ్‌జిత్ సింగ్‌ది కుట్రపూరిత హత్యగానే పరిగణిస్తున్నామని, ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు భావిస్తున్నామని కేంద్ర సమాచార శాఖ మంత్రి మనీష్ తివారీ అన్నారు. సరబ్‌జిత్ పట్ల పాక్ వైఖరి అమానవీయమని ఆయన పేర్కొన్నారు. సరబ్ వ్యవహారంపై పాక్ ప్రధానితో 15 నెలల క్రితమే భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట్లాడారని, మానవీయ కోణంలో సరబ్‌జిత్‌ను విడుదల చేయాలని అప్పుడే కోరారని మనీష్ తెలిపారు. విదేశీ ఖైదీల పట్ల వ్యవహరించే తీరులో పాకిస్థాన్ వైఖరి సరిగా లేదన్నారు. జెనీవా ఇప్పందాలను పాకిస్థాన్ ఉల్లఘించినట్లు అర్థమవుతోందన్నారు. సరబ్‌జిత్ వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తివారీ ఆరోపించారు. ఈ అంశాన్ని అంతర్జాతీయ న్యాయ వేదికల దృష్టికి తీసుకువస్తామని ఆయన చెప్పారు. మానవహక్కుల ఉల్లంఘనకు పాక్ పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాగా సల్మాన్ ఖుర్షీద్ సరబ్ హత్య భారత్ -పాక్ సంబంధాలపై ప్రభావం చూపుతుందని, ఈ అంశం ఉభయదేశాల ప్రజల మధ్య కూడా విభేదాలు సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
విచారణ చేపట్టాలి : ప్రకాశ్‌సింగ్ బాదల్
పాకిస్థాన్ సరబ్‌జిత్ సింగ్ మృతిపై పూర్థిస్థాయి విచారణ చేపట్టాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ డిమాండ్ చేశారు.
రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా
పాకిస్థాన్ ఖైదీల దాడిలో గాయపడి మృతి చెందిన సరబ్‌జిత్ కుటుంబానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా అందించనున్నారు. అలాగే సరబ్‌జిత్ మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని లాహోర్‌కు పంపారు. శుక్రవారం సరబ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన సోదరి దల్బీర్ కౌర్ చెప్పారు. పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొంటారు.