స్వదేశానికి 85మంది భారతీయులు


కాబూల్‌ నుంచి వాయుసేన విమానంలో తరలింపు
కాబూల్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): కాబూల్‌ నుంచి భారత వాయుసేన సి`130 జే విమానం 85 మంది భారతీయులతో శనివారం బయలుదేరింది. అఫ్ఘానిస్థాన్‌ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో కాబూల్‌ నగరంలో ఉన్న 85 మంది భారత పౌరులను అధికారులు వాయుసేన విమానంలో తీసుకువస్తున్నారు. కాబూల్‌ నుంచి బయలుదేరిన ఈ విమానం ఇంధనం నింపుకోవడానికి తజికిస్థాన్‌లో ల్యాండ్‌ అయింది. కందహార్‌ నుంచి భారతపౌరులను తిరిగి తీసుకువచ్చారు. కందహార్‌ నుంచి భారత రాయబార కార్యాలయ సిబ్బంది కాబూల్‌ వచ్చి అక్కడి వారిని స్వదేశానికి తీసుకువస్తున్నారు.తాలిబాన్ల క్రూరమైన పాలన,ప్రతీకార హత్యల ముప్పు గురించి ప్రజలు భయపడుతున్నందున అఫ్ఘాన్‌ రాజధానిలో ప్రజలకు భయం పట్టుకుంది. భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో భారత అధికారులు సహాయం చేశారు.