స్వరాజ్య పాదయాత్ర విజయవంతం చేయండి
గుడిహత్నూర్: ఆగస్టు ( జనం సాక్షి).బహుజన రాజ్యధికారం కోసం డా విశారదన్ మహరాజ్ చేపట్టిన పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర విజయవంతం చేయాలని దళిత శక్తి పోగ్రాం(డిఎస్పీ)మండల అధ్యక్షుడు బడుగు రాజేశ్వర్ అన్నారు మంగళవారం మండల కేంద్రంలో పాదయాత్ర కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం మండల కేంద్రానికి పాదయాత్ర చేరుకుంటుందని తెలిపారు ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ మండల నాయకులు రవి మహరాజ్, నరేష్ మహరాజ్, రాజు మహరాజ్ ఉన్నారు.