స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు భావితరాలకు చాటి చెప్పాలి
త్యాగమూర్తుల పోరాట ఫలితంగానే స్వాతంత్ర్యం;
మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
కోదాడ టౌన్ ఆగస్టు 11 ( జనంసాక్షి )
స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను భావితరాలకు చాటి చెప్పాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు.గురువారం 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవల్లో భాగంగా కౌన్సిలర్లు,విద్యార్థులతో కలిసి కృష్ణప్రియ థియేటర్లో గాంధీ చలన చిత్రాన్ని పిల్లలతో కలిసి వీక్షించారు.
అనంతరం పట్టణంలోని 12,30,31 వార్డుల్లో స్థానిక వార్డు కౌన్సిలర్లతో కలిసి ఇంటింటికి తిరుగుతూ భారత్ మా జై అంటూ నినాదాలు చేస్తూ జాతీయ జెండాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య వజ్రోత్సవాన్ని ప్రతి ఇంట జరుపుకోవాలని మువ్వన్నెల పతాకం ప్రతి ఇంటి పైన ఎగురవేసి మన దేశ కీర్తి ప్రతిష్టలను దశ దిశల చాటాలన్నారు. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి తిరిగి జాతీయ పతాకాలను ఇస్తారని వాటిని ఇళ్ల పై ఎగరవేయాలి అని కోరారు.అనంతరం పలువార్డుల్లో జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో
మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,కౌన్సిలర్లు గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు గారు, పెండెం వెంకటేశ్వర్లు,షేక్.మదార్,బత్తి నేని హనుమంతరావు,
తిపిరిశెట్టి సుశీల రాజు,ధారవత్ కైల స్వామినాయక్,
ఎంఈఓ సలీం షరీఫ్,తెరాస నాయకులు రామినేని సత్యనారాయణ,వెంకటేశ్వర్లు,ఆర్పీ లు మరియు మున్సిపల్ సిబ్బంది వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు