స్వాతంత్ర ఉద్యమ చరిత్రను యువత తెలుసుకోవాలి

– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): నేటి యువత స్వతంత్ర ఉద్యమ చరిత్రను తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.శనివారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుండి సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ వరకు  మున్సిపల్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఫ్రీడమ్ ర్యాలీని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్,మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ , అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావులతో కలిసి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు.సద్దల చెరువు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వతంత్ర ఉద్యమ చరితలో మహనీయుల త్యాగం వెలకట్టలేనిదని అన్నారు.యువతతో పాటు ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర ఉద్యమ చరిత్రపై అవగాహన కలిగి ఉండాలన్నారు.ఫ్రీడమ్ ర్యాలీలో వేల మంది విద్యార్థులు పాల్గొనటం అభినందనీయం అన్నారు.200 మీటర్ల పొడవు గల జాతీయ జెండాతో కొనసాగిన ర్యాలీ గొప్ప విషయమని, వజ్రోత్సవాల వేడుకలు చివరి రోజు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు.మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వతంత్ర ఫలాలు అందరికి అందుతున్నాయన్నారు.శాంతియుత వాతావరణంలో జిల్లా ముందుకెళుతుందని, స్వతంత్ర భావన కలిగి ఉండాలని అన్నారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు వజ్రోత్సవ వేడుకలలో మరింత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయని, ఈ వేడుకలలో యువత ఎక్కువగా పాల్గొనాలని ఆకాంక్షించారు.భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రపై అవగాహన పొందాలన్నారు.అనంతరం బెలూన్ లను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితా ఆనంద్,మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి , తహసీల్దార్ వెంకన్న, జిల్లా అధికారులు , కౌన్సిలర్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు , పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.