స్వేచ్చా భారతికి ప్రణతి

సమర ధీరుల శౌర్య సంతకం

అమర వీరుల త్యాగ సంకేతం

మహాయోధుల స్ఫూర్తి సందేశం

మహనీయుల అహింసా సుపథం

సర్వస్వతంత్రం నా మేటి భారతం

సకల సంస్కృతుల సదనం

సర్వమత సమభావ సన్నిధం

సత్యం ధర్మం శాంతి సమ్మిళితం

సమైక్యత సమగ్రతల సమాహారం

సుప్రసిద్దాత్మకం నా దివ్య భారతం

అద్వితీయ ప్రజాస్వామ్యం

అనిర్వచనీయ గణతంత్రం

అపూర్వమైన దేశ రాజ్యాంగం

అశేషమైన జనజీవన ప్రభాతం

అఖండతేజం నా భవ్య భారతం

ఈ శుభప్రదం దినముల

విను విధులన్నీ విస్తుపోయేలా

మువ్వన్నెల పతాకం ఎగరేసి

జనగణమన గీతం పల్లవిద్ద్దాం

అష్టదిక్కులు ప్రతిద్వనించేలా

వందేమాతరమని నినదిద్ద్దాం

భువనతలము ప్రకంపించేలా

స్వేచ్ఛా కవాతు నిర్వహిద్దాం

ప్రకృతి మాతే పరవశించేలా

అమరుల సమరుల కీర్తిద్దాం

విశ్వంభర అచ్చెరువొందేలా

దేశ స్వాతంత్ర్య సంబరాలు

దిగ్విజయవంతం గావిద్దాం

జయహో భారత జనయిత్రీ

జయ విజయహో దివ్య ధాత్రి

       “”””””””””””

(భారత స్వాతంత్ర్య ఉత్సవం సందర్భంగా…)

          కోడిగూటి తిరుపతి

         Mbl no;9573929493

……………………………………………………………………….

స్వాతంత్ర్య భారతం….!

భారత నేల తివర్ణ జెండాలతో వీధి వీధినా
దేశ ఐక్యతను చాటుతూ మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది….
యావత్ దేశం భారత్ మాతకి జై అంటూ
నినాదాలతో దేశ భక్తి చాటుతున్నారు….

కుల, మత, లింగ భేదం లేకుండా
అందరూ కలసి జరుపుకునే పండుగా
స్వాతంత్ర్య వేడుక…..

భారతీయులమని గర్విస్తూ దేశ ఔన్నత్యన్ని
ప్రపంచ దేశాలకు తెలిసేలా అంగరంగవైభవంగా
నిర్వహిస్తూ దేశ ఐక్యతను చాటుతున్నారు…

ఆనాటి స్వాతంత్ర్య సమర యోధులను
స్మరించుకుంటూ గాంధీ ఆశయాలకై
కలసి కట్టుగా ప్రయనిద్దాం….

మిద్దె సురేష్
కవి, వ్యాసకర్త
9701209355