హన్మకొండ బ్యూరో

పైల్ నెంబర్ 01 ఫోటో వాడుకోగలరు
బాలల సంక్షేమంపై దృష్టి సారించాలి…
బాలల హక్కులు కాపాడాలి
     – -కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
హన్మకొండ బ్యూరో చీఫ్ 30 ఆగస్టు జనంసాక్షి
బాలల సంక్షేమంపై దృష్టి సారించి వారి హక్కులను కాపాడాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు, మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో బాలల సంక్షేమం మరియు బాలల సంరక్షణ కమిటీ,  బెటి బచావో బేటి పడావో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం  జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా  హాజరైన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థల బాలల సంరక్షణ కేంద్రాలలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సంబంధిత అధికారిక కమిటీతో పాటు ఒక మెడికల్ ఆఫీసర్  పర్యవేక్షణ చేసి బాల బాలికల ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు వ్యక్తిగత నివేదిక సిద్ధం చేసి సంబంధిత శాఖ దృష్టికి తీసుకు రావాలని ఆదేశించారు.
జీవో ఎం ఎస్ నంబర్ 47 ప్రకారం అర్హులైన పిల్లలకు సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశాలు కల్పించుటకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు,
పెన్సిల్ పోర్టల్ పై విస్తృత అవగాహన కల్పించాలని, ఇట్టి విషయంలో కార్మిక శాఖ ముఖ్య భూమిక  పోషించాలని,14 సంవత్సరాలలోపు బాల కార్మికులను గుర్తించి సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేయాలని అన్నారు,
అర్బన్ డిప్రైవ్డ్ పాఠశాలకు వెళ్లి అక్కడి అవసరాలను గుర్తించి నివేదికను అందించినట్లయితే తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు,
బేటి బచావో బేటి పడావో పై మరియు గర్భస్థ లింగనిర్ధాన చట్టం పై విస్తృత అవగాహన కల్పించాలని, నగర కూడళ్లలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేయాలని అన్నారు, బాలల సమస్యల తక్షణ పరిష్కారం కోసం బాలల లోక్ అదాలత్ నిర్వహించుటకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులకు సూచించారు, బాలసదనంలో ఆశ్రయం పొందుచున్న బాలికల చదువు సాజావుగా కొనసాగించుటకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా రవాణా నిమిత్తం ఆర్టీసి అధికారులతో మాట్లాడి బస్సు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు,
బాలల రక్షణ సంరక్షణ కోసం అధికారులు అంకిత భావంతో పని చేసి బాలల స్నేహ పూర్వక సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కోరారు
బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ కే శిరీష మాట్లాడుతూ అన్ని సంక్షేమ గురుకులాలలో సజెషన్ బాక్స్ ఏర్పాటు చేసి బాల బాలికల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపాలని కోరినారు.
కాగా కార్యక్రమంలో ప్రగతి నివేదికను డిసిపివో సంతోష్ కుమార్, చైల్డ్ రెస్క్యూ వివరాలను చైల్డ్ లైన్ నోడల్ కో ఆర్డినేటర్ పాషా  పవర్ పాయింటు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
కార్యక్రమంలో  అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మదన్ మోహన్ రావు, కార్మిక శాఖ అధికారుకు డాక్టర్ సామ్యూల్ జాన్,ప్రసాద్ రావు, ఎన్సిఎల్పి పిడి బి అశోక్ కుమార్, డిటిడివో ప్రేమకళ, డీఎస్సీడివో బి నిర్మల, ఆర్సీవోలు వి రాంసింగ్, డాక్టర్ శరత్ బాబు, శ్రీపాల, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికి సుధాకర్, కే దామోదర్, ఎస్ రాజేంద్ర ప్రసాద్, పి హైమావతి,
యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ కే సుజాత,
బాల సదనం పర్యవేక్షణాధికారి కల్యాణి, యూడిసి వెంకట్ రామ్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎల్సిపివో సతీష్ కుమార్, చైల్డ్ లైన్ నోడల్ కో ఆర్డినేటర్ పాషా,కౌన్సిలర్ మాధవి, విజయ్ కుమార్, జ్ఞానేశ్వరి, రవి కృష్ణ,  స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కళ్యాణ్, ఎర్ర శ్రీకాంత్, ఫాదర్ అలెక్స్ తదితరులు ఉన్నారు.