హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి

వనపర్తి జులై 22 (జనం సాక్షి) ఆల్ హమాలీ కార్మికుల కు  వెల్ఫేర్ బోర్డు ను ఏర్పాటు చేయాలని ఆగస్ట్ 3న చలో హైదరాబాద్ కార్యక్రమం  నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమం జయప్రదం కోసం శుక్రవారం వనపర్తి జిల్లా హమాలీ యూనియన్ విస్తృత స్థాయి సమావేశం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు  అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ హమాలీ,రైస్ మిల్లు,దాల్ బాయిల్డ్, కబాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని 73షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల కనీస వేతనాల జీవోలను సవరించాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్‌లనురద్దు చేయాలని రైసు మిల్లు పరిశ్రమలను కాపాడాలని సి ఎం ఆర్   బియ్యాన్ని ఎఫ్ సి ఐ ద్వారా కొనుగోలు చేయాలని హమాలీలకు ఉపాధి పని భద్రత కల్పించాలని హమాలీ కార్మికులందరికీ ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని  పీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని  తదితర డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 3న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని  ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లాలో ఉన్న హమాలీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్, జిల్లా నాయకులు నందిమల్ల రాములు, హమాలీ యూనియన్ నాయకులు బీసన్న,నారాయణ,వెంకటస్వామి,పెంటన్న,రాజు,రాములు,శ్రీను తదితరులు పాల్గొన్నారు
.
Attachments area