హరికృష్ణకు అశోక్‌ గజపతి నివాళి

 

 

విజయనగరం,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): టిడిపి సీనియర్‌ నేత హరికృష్ట మృతి పట్ల కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు బుధవారం తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. జిల్లా టిడిపి కార్యాలయం అశోక్‌ బంగ్లాలో అశోక్‌ గజపతిరాజు, ఎమ్మెల్యే విూసాల గీత, జిల్లా నేతలు కలిసి హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ.. టిడిపి ప్రారంభం నుండి హరికృష్ణతో కలిసి పని చేశానని తెలిపారు. తెలుగు వాళ్లు ఐక్యంగా ఉండాలని కోరి రాజ్యసభ పదవికి సైతం ఆయన రాజీనామ చేశారని పేర్కొన్నారు. ఓ మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధగా ఉందని,హరికృష్ణ ఆత్మకి శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

 

తాజావార్తలు