హరితహారంపై ప్రత్యేక శ్రద్ద

ఆదిలాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): జూలైలో జరిగే మూడో విడత హరితహారం కార్యక్రమానికి ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. నర్సరీలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ దివ్యాదేవరాజన్‌ అన్నారు. హరితహారం కార్యక్రమం కోసం పెంచుతున్న నర్సరీలను సందర్శించి మొక్కల పెంపకాలపై శ్రద్ద తీసుకుంటున్నారు. నర్సరీలను తనిఖీ చేసి నర్సరీల పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో మొక్కల పెంపకానిది ప్రాధాన్యతను ఇస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు ఇవ్వాలని లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ హెచ్చరించారు. నర్సరీలో ఎన్ని మొక్కల పెంపకం చేపడుతున్నారని తెలుసుకుంటున్నారు. మట్టిలో కలిపిన ఎరువుల వివరాలపై ఆరా తీశారు. ఎస్టిమేట్‌ను పరిశీలించారు. నర్సరీలను ఎప్పడికప్పుడు సందర్శించాలని ఆదేశించారు.

తాజావార్తలు