హరితహారం అందరిదీ
ఆదిలాబాద్,జూన్9(జనం సాక్షి ): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడతున్న హారితహారం కార్యక్రమం జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టబోతున్నామని డీఆర్‌డీవో పీడీ అన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములై విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. నర్సరీ నిర్వాహకులకు ఎప్పటికప్పుడు బిల్లులు అందజేస్తూ ప్రోత్సహించాలన్నారు. నర్సరీలదే కీలక పాత్ర అని అన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాల న్నారు. ఇంటింటా మొక్కలు నాటి వాటి పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విత్తనం మొదలు, మట్టి. కవర్లు నాణ్యమైనవి కొనుగోలు చేయాలన్నారు. ఎన్‌ఆర్ ఈజీఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న టేకు నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడి నర్సరీ నిర్వహణలో నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు.