హరితహారం ఉద్యమంలా చేపట్టాలి: ఎమ్మెల్యే
ఆదిలాబాద్,జూలై3(జనంసాక్షి): హరితహారం ఉద్యమంలా చేపట్టి జిల్లాకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాలని డిఆర్‌డిఎ అధికారి సూచించారు. ఎవరైనా ఆలసత్వం ప్రదర్శిస్తే ఊరుకోబోమని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విలైన చోట్ల ఎక్కువ చెట్లను పెంచాలని అధికారులకు సూచించారు. రోజురోజుకూ అడవుల శాతం తగ్గుతూ వస్తుందని, సీఎం కేసీఆర్ చెట్లను పెంచేందుకు ఒక మ¬న్నతమైన ప్రణాళికను రచించారని అన్నారు. ఇంటి పరిసరాల్లో వీలైన మొక్కలను నాటే విధంగా ప్రజల్ని కళాబృందాల ద్వారా చైతన్య పర్చాలని ఆదేశించారు. రహదారులకు ఇరుపక్కల, రైలు మార్గాల వెంట కాలువలు, గట్లు, చెరువులపైనా అందుకు అనువైన మొక్కను పెంచే విధంగా కార్యచరణ రూపొందించాలని సూచించారు. మూడో విడత హరితహారం ప్రారంభం కానుందని, ప్రతి ఒక్కరూ మొక్కను కాపాడుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటేందుకు ఆదేశాలు అందాయని, వాటిని సక్రమంగా నాటి, పెంచేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. నామామాత్రంగా మొక్కలు నాటి చేతులు దులుపుకోవడం కాదని, మొక్కను బతికించేందుకు అధికారులంతా చర్యలు చేపట్టాలని తెలిపారు. వాటికి అవసరమైన నీరు, చుట్టూ వలయం అన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అధికారులు రహదారికి ఇరుపక్కల, కాలువలు, గట్లు, చెరువులపై నాటే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫారెస్టు అధికారులు బంజార భూములు, బోడు గుట్టలు, రిజర్వు ఫారెస్టులో మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు ఫారెస్టు, ఎంపీడీవో, ఈజీఎస్ సిబ్బంది కలిసి మండల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొవాలని సూచించారు. పంట పొలాల్లో, గట్లపైనా అధిగ దిగుబడులిచ్చే మొక్కల్ని నాటాలని అందుకు రైతులను సమయత్తం చేయాలని సూచించారు. పాఠశాలలు, ప్రార్ధన మందిరాలు, పార్కులు, తోటలు, ఆటస్థలాలల్లో ఎక్కువగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. గత ఏడాది నాటిన మొక్కల సంఖ్య, బతికున్న శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రోడ్డుకు ఇరువైపు పెంచే మొక్కలకు ఖచ్చితంగా ట్రీ గాడ్స్, నీరు పోసే చర్యలను చేపట్టాలని, అవసరమైతే అందుకు అయ్యే ఖర్చును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు. ఇదిలావుంటే నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని ఐసీడీఎస్ జిల్లా సంక్షేమాధికారి పేర్కొన్నారు. నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ఈ ఏడాది విజయవంతం చేసేందుకు వేగవంతంగా మొక్కలు నాటే కార్యక్రమానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. అంగన్‌వాడీల ఆధ్వర్యంలో మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అవసరమైతే ఇంకా మరిన్ని మొక్కలు నాటేందుకు ముందుకొస్తున్నామని పేర్కొన్నారు.