హరివిల్లును తలపించిన రంగోళీ పోటీలు

భారీగా తరలి వచ్చిన మహిళలు.
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని  నిర్వహించిన రంగోళీ పోటీలు అందమైన హరివిల్లులను తలపించాయని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
అన్నపూర్ణ అన్నారు.శనివారం శనివారం జిల్లా కేంద్రంలోని సద్దల చెర్వు మినీ ట్యాంక్ బండ్ వద్ద రంగోళీ పోటీలను నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంతో పాల్గొని అన్ని కార్యక్రమాలను తిలకిస్తున్నారని అన్నారు.మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేశభక్తి అంశంగా రంగోలి  కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు తరలివచ్చి ఆకర్షణీయమైన రీతుల్లో రంగురంగుల ముగ్గులు వేశారు. విజేతలుగా ఎంపికైన మహిళలకు బహుమతులు అందజేశారు. ప్రతిఒక్కరిలో
జాతీయత భావం , స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి కలిగి ఉండాలని, భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొనసాగుతున్న వజ్రోత్సవ వేడుకల్లో  పుర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని శాఖల సిబ్బంది భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితా ఆనంద్ , మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి , పిడి మెప్మా రమేష్ నాయక్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, స్వయం సహాయక సంఘాలు, మహిళలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.