హరీశ్‌కు కేసీఆర్ ఆశీర్వాదం
హైదరాబాద్,జూన్ 3(జనంసాక్షి):నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం తన 44వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి, తన మామ కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు హరీష్ రావు పాదాభివందనం చేశారు. కేసీఆర్ ఆయనను ఆశీర్వదించి, ఆప్యాయంగా దగ్గరకు
తీసుకున్నారు.రాష్ట్ర మంత్రులు, పలువురు కార్యకర్తల నడుమ హరీశ్ రావు కేక్ కట్ చేశారు. ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆయనకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పుట్టిన రోజు వేడుక సందర్భంగా హరీశ్ రావుకి శుభాకాంక్షలు తెలపడానికి మంత్రులు, కార్యకర్తలు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కొందరు మహిళా నేతలు ఆనందంతో నృత్యాలు చేశారు.కాగా పద్నాలుగేళ్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. ఈ సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో విస్మరించలేని పేరు హరీశ్‌రావు. ఉద్యమంలోనే కాదు.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ ఆయన కీలక మంత్రి. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్.. ‘తెలంగాణను కోటి ఎకరాల మాగాణం’ చేస్తామంటూ సాగునీటి ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వంలో, పార్టీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గిందని, సీఎం తనయుడితో ఆధిపత్య పోరు సాగుతోందన్న వార్తలను ఆయన తోసిపుచ్చిన విషయం తెలిసిందే.కాగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు 44వ జన్మదినాన్ని హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకొన్నారు. మంత్రుల నివాస ప్రాంగణంలో.. పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఈ వేడుక జరిగింది. ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి.. హరీశ్‌రావుకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొందరు మహిళా నేతలు ఆనందంతో నృత్యాలు చేశారు. దీంతో మంత్రుల నివాస ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. అంతకుఎ ముందు క్యాంపు కార్యాలయానికి వెల్లిన హరీష్ రావు సిఎం కెసిఆర్ ఆశిస్సులు తీసుకున్నారు. ఆయనకు పాదాభివందనం చేసి పుష్పగుఛ్చం అందించారు.