హరీశ్‌ లేఖ బయట పెట్టు

4

– ఉమ

ఏలూరు,మే18(జనంసాక్షి):ఈర్డీఎస్‌ వ్యవహారంపై హరీష్‌ రావు చే/-తున్న వ్యాఖ్యలను మంత్రి దేవినేని ఉమ ఖండించారు.  తెలంగాణ ప్రభుత్వం చర్చలకు రాకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఈ వివాదం ఒక్క హరీశ్‌రావుదో.. దేవినేని ఉమాదో కాదు.. మూడు రాష్టాల్రకు సంబంధించిందన్నారు.  ఆర్‌డీఎస్‌ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను  మంత్రి దేవినేని ఉమా ఖండించారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఒప్పించి రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డీఎస్‌) పనులు ఓ కొలిక్కి తీసుకొస్తే.. ఏపీ పాలకులు దానికి మోకాలడ్డటం దారుణమని హరీశ్‌రావు మంగళవారం మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఏలూరులో మంత్రి ఉమా విూడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కేసీఆర్‌తో కుమ్మక్కై రూ.10 వేల కోట్ల పనులకు కాంట్రాక్టు తీసుకొని వాటిద్వారా డబ్బులు సంపాదిస్తూ జలదీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలు కలెక్టర్‌ రాసిన లేఖను బహిరంగంగా చూపించాలని డిమాండ్‌ చేశారు. రెండు రాష్టాల్ర  మధ్య వివాదాలు మంచిది కాదని, ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. అనుమతులు తీసుకొని ప్రాజెక్టులు నిర్మించుకోవాలని, లేకపోతే కింద ఆయకట్టు రైతులు నష్టపోతారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.