హర్యాణాలో కాల్పులు.. కర్ఫ్యూ

1

– రంగంలోకి దిగిన సైన్యం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20(జనంసాక్షి): జాట్ల ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. కాల్పుల ఘటన నేపథ్యంలో ఆర్టీ రంగంలోకి దిగింది. పలు ప్రాంతా/-లలో కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు కోరుతూ హర్యాణాలో జాట్లు శనివారం కూడా విధ్వంసానికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్‌ కార్యాలయంతో పాటు ¬టల్స్‌, పలు దుకాణాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు అనంతరం రహదారులపై బైఠాయించారు. ఇవాళ ఉదయం కూడా  పలు బస్సులను దగ్ధం చేశారు. జాట్లు ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధం చేయడంతో ఆర్మీ జవాన్లు హెలికాప్టర్‌ ద్వారా హర్యాణా చేరుకుంటున్నారు. కాగా ఆందోళన హింసాత్మకంగా మారడంతో రోహ్తక్‌, భివాని ప్రాంతాల్లో పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్వర్వులు జారీ చేశారు. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు. అలాగే కేంద్రం కూడా పారామిలటరీ బలగాలను పంపుతోంది. ఇక ఆందోళనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు గాల్లోకి జరిపిన కాల్పుల్లో నిన్న  ఓ ఆందోళనకారుడు మృతి చెందిన విషయం తెలిసిందే.  రోహతక్‌ జిల్లాలో జాట్‌ల ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. జాట్‌లకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గతం వారం రోజులుగా చేస్తున్న ఆందోళన ఘర్షణలకు దారి తీసింది. ఆందోళనకారులు పోలీసు వాహనాలకు, ¬టల్స్‌, దుకాణాలకు నిప్పంటించడంతో హింసాత్మకంగా మారింది.  స్థానిక మంత్రి ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు. పరిస్థితి అదుపుతప్పడంతో సైన్యం రంగంలోకి దిగింది. జాట్‌లు రహదారులను దిగ్భందించడంతో మరో దారి లేక సైన్యం ఆర్మీ చాపర్‌ ద్వారా రోహతక్‌ చేరుకోవాల్సి వచ్చింది. హరియాణా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కెప్టెన్‌ అభిమన్యు ఇంటికి నిప్పంటించి తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు, భద్రతసిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు సైన్యం కూడా రంగంలోకి దిగింది. మంత్రి ఇంటికి నిప్పంటించిన తర్వాత కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌, రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రోహతక్‌ పరిస్థితిపై ఆ రాష్ట్ర సీఎంతో సవిూక్షించారు. ఆందోళనకారులు రోడ్లు, రైలు మార్గాలను పూర్తిగా దిగ్భందించారు. దీంతో చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. ఆందోళనకారుల ప్రభావం తీవ్రంగా ఉన్న రోహతక్‌, జాజ్జర్‌, సోనిపట్‌, భివాని, కర్నాల్‌, హిస్సార్‌ ప్రాంతాల్లో పరిస్థితి అదుపుచేసేందుకు

సైన్యం రంగంలోకి దిగింది. ఆందోళకారులను అదుపుచేసే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో 9మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇకపోతే  జింద్‌ జిల్లాలోని బుద్ధా ఖేర్‌ రైల్వే స్టేషన్‌కు ఈరోజు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో స్టేషన్‌లోని ఫర్నీచర్‌, రికార్డు రూమ్‌, ఇతర వస్తువులు కాలిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. గత వారం రోజులుగా హరియాణాలో జాట్‌ల ఆందోళన కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలను పూర్తిగా దిగ్భందించారు. దీంతో దాదాపు 150 రైళ్లు రద్దయ్యాయి. పోలీసులు, భద్రత బలగాలు, సైన్యం రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. పలుచోట్ల కర్ఫ్యూ విధించారు. గుడ్‌గావ్‌ వెళ్లే రోడ్డు, ప్రధాన జాతీయ రహదారులను ఆందోళనకారులు దిగ్భందించారు. దీంతో హర్యానాకు దారి తీస్తున్న రోడ్లన్నీ స్తంభించాయి. జాట్ల ఆందోళన వల్ల సుమారు 500 రైళ్లపై ప్రభావం పడింది. సుమారు 72 రైళ్లను రద్దు చేసినట్లు ఉత్తర రైల్వే సీపీఆర్వో నీరజ్‌ శర్మ తెలిపారు. ఆందోళనకారులు రోహతక్‌లో ఆర్టీసీ బస్సులను తగలబెట్టారు. పానిపట్‌, రోహతక్‌, రివాడీ వెళ్లే రోడు మార్గాలన్నీ మూసివేశారు. రోడ్లన్నీ మూసివేయడంతో ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్లతో ఆ ప్రాంతాలకు చేరుకుంది. బివానీ పట్టణానికి ఆర్మీ హెలికాప్టర్లు చేరుకున్నాయి. అక్కడ కర్ఫ్యూ విధించారు. హెలికాప్టర్ల ద్వారా చేరుకున్న ఆర్మీ కర్ఫ్యూ ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తుంది. మొత్తం ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఆ జిల్లాలో స్కూళ్లకు సోమవారం వరకు సెలవు ప్రకటించారు. బుద్దఖేడా రైల్వే స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.