హస్తినకు సీఎం కేసీఆర్‌

3
4 రోజుల పర్యటనకు దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి

దిల్లీ/హైదరాబాద్‌, ఫిబ్రవరి5(జనంసాక్షి): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ గురువారం రాత్రి 11 గంటలకు హస్తిన చేరుకున్నారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉండేలా పర్యటన ప్రణాళిక ఖరారైంది. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ‘నీతి ఆయోగ్‌’ తొలి సమావేశానికి కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఈ భేటీకి మూడు రోజుల ముందే ఢిల్లీ వెళ్తున్న సీఎం పది మందికిపైగా కేంద్ర మంత్రులతో భేటీకానున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన ఆర్థిక సాయం, రాష్ట్రానికి ప్రత్యేక¬దా, హైకోర్టు విభజన, మిషన్‌ కాకతీయకు సాయం తదితరాలపై ఆయన కేంద్రమంత్రులకు విన్నవించనున్నారు. సీఎం పర్యటన వివరాలను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకప్రతినిధి వేణుగోపాలాచారి బుధవారమిక్కడ సచివాలయంలో విలేకరులకు వెల్లడించారు.ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ ¬దా, రాష్ట్రానికి ప్రత్యేక ¬దా, వాటర్‌గ్రిడ్‌కు కేంద్ర నిధులు తదితరాలపై కేసీఆర్‌ కేంద్రమంత్రులతో చర్చిస్తారని వివరిం చారు. మిషన్‌ కాకతీయ ప్రారంభానికి ఆహ్వానం,  కృష్ణా నదీ జలాల వివాదాన్ని  మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. మంత్రికి ఇచ్చే నోట్‌ను సైతం అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.