హాట్టహాసంగా మాశమ్మ అవ్వ యూత్ గణేష్ లడ్డు వేలం పాట

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి ) సెప్టెంబర్ 10 : గద్వాల పట్టణం 7వ వార్డు దౌదర్ పల్లి లో మాశమ్మ అవ్వ యూత్ అద్వర్యంలో వరసిద్ధి వినాయక ఉత్సవ వేడుకలు ప్రతి ఏటా నిర్వహించే వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమానికి ముందు రోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం నిర్వహించిన గణేష్ శోభాయాత్రలో లడ్డు లు వేలం వేయడంతో  లడ్డు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. ప్రతి సంవత్సరం లాగానే నిత్య పూజలు చేసి ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రతిరోజు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించటం ఉత్సవ కమిటీ ప్రత్యేకత. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా దౌదర్ పల్లి మూడు బాటల దగ్గర లడ్డుకి వేలంపాట నిర్వహించారు. దౌదర్ పల్లిలో గత సంవత్సరం లడ్డులను  వేలంపాటలో కైవసం చేసుకున్న వారికి మంచి జరగడంతో ఈసారి కూడా మహిమాన్వితమైన లడ్డులను  కైవసం చేసుకోవడానికి పలువురు పోటీ పడ్డారు లడ్డులను కైవసం చేసుకోవడానికి పలువురు  పోటాపోటీగా వేలంపాటలో పాల్గొన్నారు. చివరికి  పెద్ద లడ్డు రూ” 54,116 రూపాయలకు చిన్న రవి (లక్ష్మి జ్యువెలర్స్)  కైవసం చేసుకోగా చిన్న లడ్డు గట్టు వెంకటేష్ రూ”22,116 రూపాయలకు కైవసం చేసుకొన్నారు ఈసంధర్బంగా నిర్వాహకులు వారిని సన్మానించి లడ్డులను వారికి అందజేశారు అనంతరం నిర్వహించిన వినాయకుడి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా శోభాయమానంగా ప్రారంభమైంది. చిన్నా పెద్ద తేడా లేకుండా భక్తులందరూ సాంస్కృతిక కార్యక్రమాలతో నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు దౌలు , రాఘవబంగారు,గట్టురఘు ,రామకృష్ణ ,నర్సింహులు ,ప్రవీణ్ ,చరణ్ ,కార్తీక్ ,శ్రీను ,రాజు ,ఉమాపతి ,అనిరుద్ ,మంజునాథ్ ,అభినవ్ లతో పాటు ఉత్సవ కమిటీ మహిళా సభ్యులు కవిత ,యశోద ,రేవతి ,రజిత ,అంజనమ్మ ,గట్టులక్ష్మి ,వెంకటమ్మ ,సునిత ,సంధ్య ,మంగమ్మ,బొగ్గులసుంకులమ్మ ,జయమ్మ ,సభ్యులతో పాటు  భారీగా భక్తజనం పాల్గొన్నారు.