హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరెట్ ఎదుట ఆందోళన.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 31. (జనం సాక్షి). గతంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సోమవారంఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో భూమిలేని నిరుపేద దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పంతం రవి, కడారి రాములు తదితరులు పాల్గొన్నారు.