హాసకొత్తూర్ లో పెద్దమ్మ బోనాలు*
కమ్మర్పల్లి 11.మే (జనంసాక్షి) కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామములో శనివారం రోజున ముది రాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ బోనాల ఊరేగింపు చాలా ఘనంగా నిర్వహించారు. అలాగే గ్రామ శుక్రవారం దేవి ఆలయంలో గ్రామ మహిళలు కుంకుమార్చన చేశారు.ఆలయ అర్చకులు రమణాచార్యులు మాటడ్లుతు ప్రతి సంవత్సరం గ్రామంలో పెద్దమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ బోనాల కార్యక్రమంలో గ్రామ ప్రజలే కాకుండా వివిధ గ్రామాల నుండి కూడా ప్రజలు పాల్గొంటారని అన్నారు. గ్రామ శుక్రవారం దేవి చాలా మహిమగల దేవిగా ఇక్కడి ప్రజలకు కొలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్, ముదిరాజ్ సంఘం సభ్యులు, కమ్మర్పల్లి బీజెపి మండల అధ్యక్షులు కట్టా సంజీవ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.