హాస్యనటుడు పొట్టి రాంబాబు కన్నుమూత
హైదరాబాద్: హాస్యనటుడు పొట్టి రాంబాబు (35) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో శ్రీనగర్ కాలనీలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం రాంబాబు తుదిశ్వాస విడిచారు. దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటించిన రాంబాబు ఈశ్వర్, చంటిగాడు, కథానాయకుడు, దొంగ దొంగది, గోపి గోపిక గోదావరి, మీనాక్షి చిత్రాల్లో హాస్యనటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి. రాంబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.