‘హిందుత్వ’ దాష్టీకాన్ని ప్రశ్నించిన ముస్లింవాద కవిత్వం

(శనివారం సంచిక తరువాయి…)

ఒక అందమైన తోట / ఆ తోటలో రకరకాల పూలు రంగురంగుల పూలు గులాబీలు మందారాలు చమేలీలు మొగలిపూలు బంతిపూలు గుల్‌మొహర్‌లు అన్ని రకాల పూలతో చాలా అందంగా కనబడుతుందా తోట అయితే / ఆ పూలన్నింటినీ నలిపేసి, తొక్కేసి, నరికేసి ఒక్క కమలమే విస్తరించాలంటేఆ తోట అందమంతా ఏమై పోతుంది ?!అన్నాడు జల్‌జలా కవి ఆఫ్రీన్‌, ఇప్పుడు దేశంలో అదే జరుగుతుంది. భిన్న కులాల భిన్న భాషల, భిన్న సంస్కృతుల, భిన్న మతాల వారిని సంహరించి ఒక్క ‘హిదూత్వ’ మతోన్మాదులే ఈ దేశం లో మిగలాలని కలలు కంటున్నారు. అందుకు నిదర్శనం గుజరాత్‌ ముస్లిం జాతి హత్యాకాండ.’గుజరాత్‌’ అంటే ఒక ముస్లిం స్త్రీ గర్భం లో త్రిశూలం గుచ్చి కడుపులో ఉన్న శిశువుని బైటికి లాగి త్రిశూలం మొనపై ఆడించి మంటల్లోకి విసిరిన సైశాచికత్వం.గుజరాత్‌ అంటే ఐదేరేళ్ల పసివాడికి పెట్రోల్‌ తాగిచి ఆ లేత పెదాలపై అగ్గిపుల్ల అం టిస్తే ఆ చిన్నారి దేహం ఫట్‌ మని పేలిపోయిన అమానవీయ దృశ్య ంతల్లు ముందే పిల్లల్ని పిలల్లల ముందే తల్లుల్ని సామూహికంగా చెరి చి ముక్కలుగా నరికి తగలబెట్టిన వైనం.పాడుబడిన బావిలోకి మను షుల్ని విసిరేసి పై నుంచి రాళ్లెత్తేయడం..ప్రాణ భయంతో పారిపో తున్న 70 మందిని టెంపోలోనే సజీవ దహనం చేయడం…తన తల్లిని తగలబెడుతున్న దృశ్యం కళ్లల్లోకి ప్రసరించిన ప్రతిసారీ ఏడేళ్ల ఇమ్రాన్‌ పెడుతున్న కేక…పూడ్చుకోవడానికి కూడా మిగలని వంద లూ వేల బూడిద కుప్పలు.’భార్యల కనురెప్ప మీదే భర్తల దహనం.. భర్తల పిచ్చి పూచుల ముందే బరిసెలు దిగబడిన యోనుల రక్తం కేకలు.. యోనుల రక్తస్త్రావంలో మునిగిపోతున్న నా దేశం..

రామబానంతో వాళ్ళు / విష్ణు చక్రంతో / కృష్ణ చక్రంతో వాళ్ళు / శివుని త్రిశూలంతో వాళ్ళు / హనుమంతుని గదతో వాళ్ళు.. / అయ్‌ అల్లహ్‌.

ఈ చేతులు ఉట్టి దువాకేనా ?. -స్కైబాబ

ఐదు నుంచి 10 వూల మంది దాకా గుంపుగా కత్తులు, త్రిశూ లాలు, పిస్తోల్లు, యాసిడ్‌ పట్టుకొని ఒక్కొక్క ఊరిలో ఉన్న ముస్లిం బస్తీల మీద పడి చంపుతుంటే పారిపోయిన ముస్లింలు చెట్లనకా, పుట్టలనకా, గుట్టలనకా, పగలనకా, రాత్రనకా కిలోమీటర్ల కొద్దీ పరు గులు పెట్టారు.పసి దాహాలకు గుక్కెడు నీళ/్ల నిరాకరించబడిన సంఘ ంలో ఒకరి మూత్రాన్ని మరొకరికి తపించుకున్న నిస్సహాయత.. పసి ఆకలికి నాలుగు మెతుకులు దొరక్కుండా చేసిన రాజ్యంలో పుట్ట మన్నులో నీళ్లు కలిపి తినిపించుకున్న నిస్పహాయత..అంతేకాక ఆకు లు అలములు తిని బతికీ చెడీ తిరిగతా ఊర్లలోకి వద్దామంటే ఆరె స్కెసస్‌ గుండాలు రకరకాల షరతులు విధిస్తే విత్తరపోయిన ముస్లిం లు ఊరిబైటే ఉండిపోయారు. ఆ షరతుల్లో ఒకటి ‘అజాం’ వినిపిం చకూడదని. ఆంధ్రప్రదేశ్‌ తెలుగు  ముస్లిం కవుల గుజరాత్‌ కవిత్వా న్ని అందుకే ‘అజాం’ పేరుతో సంకలనం చేశాం. దీనిని అన్వర్‌, నేను సంపాదకులుగా ఎంతో శ్రమకోర్చి తీసుకొచ్చాం.దళిఒత వాడలు ఊర్లలో కలుస్తున్న ఆనందం

ఒళ్లంతా పారక ముందే / ఇప్పుడక్కడ ఊరి బైట ముస్లిం వాడలు వెలిశాయి 30 వేల మంది ముస్లింలు హత్యలు చేయబడితే ఆ సంఖ్య కేవలం 11 వందలుగా చూపెట్టడం.. ఇంతలోనే ఆ సంఖ్యను అంద రం ఒప్పేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికైనా ఎప్పటికైనా గుజరాత్‌లో అసలు ఎంతమందిని చంపేశారో ఎన్ని లక్షల ఇండ్లను నేలమట్టం చేశారో ఎందరు స్త్రీలను రేప్‌ చేశారో, ఎందరు అమ్మా యిల్ని ఎత్తుకుపోయారో.. ఎంతమంది పసిపిల్లల్ని అన్ధాల్ని చేశారో తేల్చాల్సి ఉంటుంది..ఇప్పుడీ దేశాన్ని ఏ జీవజలంతో కడిగినా పోని రక్తపు వాసనకళ్ల కింది నేలే కాదు / కరిగిన ఆకాశం కూడా మురికై పోయింది అంటాడు ఖాదర్‌ షరీఫ్‌.దేశ విభజనలో లక్షల మందిని బలిచ్చుకున్నా.. అదో పెను విషాదమైనా.. మనసులకి సర్ది చెప్పు కున్నాం. కాని ఇప్పుడు ఈ గుజరాత్‌ రక్తపు తడి ఎన్నటికీ మా మన స్సుల్లోంచి ఆరిపోదు.. ఈ గుజరాత్‌లో లేచిన నల్లటి పొగ ఎన్నటికీ మా కళ్లల్లోంచి మాయమవదు.. చూస్తూ ఉండిపోయిన, అప్పుడే మరిచి పోయిన ఎందరి మీదో అసహ్యంగా ఉంది. ..

…గుడల్ని చీరి పీలికలు చేసినట్టు / మా దేహాల్ని చీల్చే స్తుంటే…ఎక్కడికని పరిగెత్తను ? / ఏ రాతి గుహల్లో దాక్కోను?

అంటూఏ షాజహానా రాతి యుగంనాటి అనాగరికతకు అనవాళ్లుగా హిందుత్వవాదులను పోలుస్తుంది.’కాలీ దునియాం’ అనే మరో కవితలో స్త్రీగా తాను గుజరాత్‌ మారణహోమాన్ని, ముఖ్యంగా ముస్లి ం స్త్రీలపై జరిగిన అత్యాచారాల్ని ప్రశ్నిస్తూ షాజహానా ఇలా అంటు ంది-..నీ ఇంట్లో ఆడది కూడా / రహస్యంగా మా కోసం కన్నీళ్ళు కా ర్చి ఉంటుంది. మగ నాకొడుకుల ఊపిరి / బయటికి రాకుండా నొక్కే స్తే / పాడా పోతుందని ఒక్కసారైనా మీ అమ్మ లనుకునే ఉండాలి / సృష్టికి ఒక్కరే తల్లీ తండ్రీ అని నమ్ముతున్న దాన్నినీకు నాకు మధ్యా రక్త సంబంధం లేదంటావా? / గుండెల్ని పెకిలించి / పొట్టలు చీల్చి / యోనుల్లో అయుధాలు పొడిచి / ఇవ్వాళ నువ్వు చావుల విందు చేసుకొనుండొచ్చు / కానీ ‘నన్ను’ హత్య చేయలేవు / అనంతంగా సాగే జీవనదిని నేను బతకడమే కాదు / నిన్ను పుట్టించి బతికించేది నేనే… / అయినా / స్త్రీ తప్ప మగాణ్ణి క్షమించేదవరు? / ఎప్పటికీ ప్రపంచం / నా రొమ్ము తాగుతున్న పసిబిడ్డే…

-ఈ కవిత మనసున్న, మనవత్వమున్న ఎవరినైనా కదిలిస్తుంది. కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. …

హమ్‌ మర్కే భి జగాతే హై

సోయీ బుయీ దునియా కో

అంటాడు అలీ.. నిజమే. 30 వేల మంది ముస్లింలు హత్య చేయ బడితే గాని భారతదేశం ఉలిక్కిపడలేదు! ఆ ఏమవుతుందిలే, ఏం చేస్తారులే అని హాయిగా కునుకదీస్తున్న మన లౌకికి వాదులూ, గ్రప తిశీలురూ, ప్రజాస్వామ్యవాదులూ, మర్కిృస్టులు, మావోయిస్టులూ అంతా దిగ్గున లేచి కూర్చున్నారు. 30 వేల మంది ముస్లింల

బలిదానం జరిగితేగాని ఈ దేశంలో ఆరెస్సెస్‌ ఏం చేయబోతోందో అర్ధం కాలేదు. అట్లా తాము చచ్చిపోయి కూడా అందరినీ మేల్కొల్పు తున్నాం అంటున్నాడు అలీ అందరూ మేల్కొన్నట్లు అనిపించింది. కాని ఆరెస్సెస్‌ను నిలుపరించే, కనీసం అది చేసే దుష్ట చర్యల్ని నిలు వరించే కార్యక్రమాన్ని కూడా ఎవరూ చేపట్టలేదు. ఊరకే ఉప న్యాసాల్లో హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోదాడుతాం అంటే సరిపోతుందా? కొన్ని సభలు చేస్తే పుస్తకాలేస్తే మన బాధ్యతల నెరవేరినట్టేనా? ఇక్కడ ఒక అనకూడని మాట కూడా అనాల నిప ిస్తోంది- జర్మనీ తత్వవేత్త ఫాస్టర్‌ నీమెల్లర్‌ అన్నట్లు.. వాళ్లు క్యాథలి క్కుల కోసం వచ్చారు/ నేను క్యాథలిక్కును కాదు గనుకె మాటా ్లడలేరు… అన్న చందంగా ఆరెస్సెస్‌ వాళ్లు వచ్చింది, వస్తున్నది ముస ి్లంల కోసం కాబట్టి ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదా?కిన్ని పదుల సంవత్సరాలుగా ఆరెస్సెస్‌ గట్టి పథకంతో దేశంలోని జనా న్నంతా హిందువైజ్‌ చేస్తూ వస్తున్నది. ముందుగా బీసీల్ని చాలా వర కు హిందువైజ్‌ చేసేశాక(?) ప్రస్తుతం దళితులు, ఆదివాసుల మీద దృష్టి నిలిపింది. అందులో భాగంగానే ఆదివాసీ ప్రాంతాలలో యోగే శ్వర పరివార్‌, గాయత్రి పరివార్‌, సద్విచార్‌ పరివార్‌ స్వామీ నారా యణ సంప్రదాయి, లాంటి పేర్లతో పని చేస్తూ ఉంది. ఇలాంటి సంస్థలే గుజరాత్‌లో ఆదివాసిల్ని ముస్లింలపైకి ఉసిగొల్పాయి, రాజస్థాన్‌లోనూ, ఒరిస్సాలోనూ పని చేస్తున్నాయి. ఒరిస్సాలో ప్రతి గిరిజనుడి ఇంట్లో ఒక త్రిశులం ఉంది. రాజస్థాన్‌లో, ఢిల్లీలో, ఉత్తర ప్రదేశ్‌లోనూ అక్షల త్రిశూలాలు పంచారు. అవన్నీ ఎవర్ని గురి చూ సేందుకు? తెలిసి కూడా మనం మౌనంగానే ఉందామాఝ ఈ విష యాలన్నీ ‘ముల్కి’ ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచికలో రికార్డు చేయ బడ్డాయి.పాఠశాలలు లేని అటవి గ్రామాల్లో సైతం ఏకోపాద్యాయ పాఠశాలల పేరుతో ఆరెస్సెస్‌ పాఠశాలలు నడుపుతుందని తెలు స్తుంది.సరస్వతి శిశు మందిర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఇంకా శారదా విద్యా మందిర్‌ ,గాయత్రి వగైరా ఎన్నో పేర్లతో నడు స్తున్నాయని కూడ హిందుత్వంనే భోధిస్తున్నాయి.ఇప్పటికే అన్ని ప్రభు త్వ సంస్థల్లో ,పోలిసుల్లో ,ఆర్మి ఆరెస్సెస్‌ బలం ఉన్న వాళ్లు నిండి పోతున్నారు.(గుజరాత్‌ లో నైతే పోలీసు శాఖ అంతా దాదాపు ఆరెస్సెస్‌తో నిండి పోయిందని తెలిసిందే)ఎంతో కాలం చైతన్యవం తులైనవాళ్లు బతుకుదెరువు కొరకు ఊళ్లొదలి పట్నాలకు వలస వెళ్తుంటే ఆరెస్సెస్‌అదే పనిగా జీతమిచ్చిఒక పుల్‌ టైమర్‌ను ఊర్లలోకి పం పుతుంది.వాళ్లు మళ్లీ ఊర్లలో చేరి పొద్దున్నే వ్యాయామం పేరు చెప్పి ఊరిబైటి ఏదేని గుడి దగ్గరికి తీసుకెళ్లి కాసేపు ఎక్సార్‌సైజులు చేయి ంచి తరువాత హిందుత్వ భోధనచేస్తున్నారు.’హిందువునని  గర్విం చు-హిందువుగా జీవించు’అనే వాక్యం కొన్ని రోజులకే ఊరి గోడల పై రాయించబడుతుంది.దాంతో పాటు ఆరెస్సెస్‌పత్రికలు జాగృతి లాంటివి, ఇంకా హిందుత్వ భావజాలం ఉన్న పుస్తకాలు చదివిసు ్తన్నారు.దాంతో ఆ యువకులంతా ముస్లింలు ఆ దేశస్తులు కారని,దేశ ద్రోహులని ,ఐఎస్‌ఐ ఏజెంట్లని నమ్మకం మొదలవుతుంది.ఇంకా ఊర్లలో కూడ వినాయకులను నిలబెట్టించడం ‘హిందూ దేవాలయా లకుమాత్రమే ప్రాదాన్యత ఇవ్వడం జరుగుతుంది.వినాయకుల విష యంలో సక్సెస్‌ ఐన హిందుత్వ వాదులు ప్రస్తుతం దసరాకు దుర్గాను కూడ నిలపడం పట్నాలలో షురూ చేశారు.ఇంకా ఎన్నో మార్గాల ద్వారా హిందుత్వను పెంచుతూ చివరికి దళితులను,ఆదివాసీలను సై తం హిందువైజ్‌ చేయడంలో సక్సెస్‌ అవుతున్న ఆరెస్సెస్‌శక్తులు ప్రతి ఎన్నికల్ని ,ప్రతి అంశాన్ని ప్రయోగంగా చూస్తు ముందుకు పోతు న్నాయి.ఇవాళ్ల దేశంలోనూ ,మహారాష్ట్రలోనూ కలిసిపోయిందని సంతోషించి సంభరపడితే లాభం లేదు.వాళ్లు వీటిని కూడ రేపటి తమ విజయానికి సోపానంగా మల్చుకుంటూనే ఉంటారు.వాళ్ల గ్రౌం డ్‌వర్క్‌ సడుస్తునే ఉందికాబట్టిఎప్పటికైనా వాళ్లు గెలిచే అవకాశం ఉంది.ఆరెస్సెస్‌ను నిలువరించే మార్గం ఒక్కటే కన్పిస్తుంది.ఎవరినైతే హిందూవైజ్‌చేస్తూ మెజారిటీలమని బుకాయిస్తూ వస్తున్నారో వాళ్లను హిందూవైజ్‌ కాకుండా ఆపడం,ఆది వాసులు,దళితులు,బీసీల వారిని హిందువులం కామన్న ఎరుకలోకి తీసుకురావడం.

రాముడు ,క్రృష్ణుడు , వినాయకుడు,తదితర యగ దేవుళ్లంతా తమ దేవుళ్లు కారనీ,తమది మాతృస్వామ్య వ్యవస్థఅనీ,గుర్తు చేయడం. ఎల్లమ్మ,మైసమ్మ,పోలేరమ్మతదితర అమ్మ దేవతల్ని కొలవడం ఆత్మన్యూనతలో పడిపోయి,అంతా మగ దేవుళ్లనుకొలిచే మాయలో పడిపోన విషయాల్ని ఇప్పడం .తమ సంస్కృతుల్ని తమ పండుగల్ని ,తమ ఆచారాల్ని ,వ్యవహారాల్ని ,గొప్పగా తడుముకునేలా చేయడం  బతుకమ్మ భోనాలు మొదలైన పండుగల్ని  హైలెట్‌ చేయడం  రాక్ష సులని చేబుతున్న వాళ్లంతా తమ దళిత నాయకులని ,తిరుగుబాటు నాయకులని విడమర్చి చెప్పడం…

ఇవన్ని కాక ఈ కుల వ్యవస్థలో ఉండడం ఇష్టంలేని వాళ్లను స్వేచ్చగా బౌద్దం ,క్రైస్తవం,ఇస్లాం,తీసుకునే స్వేచ్చ ఉందనే జ్ఞానాన్ని వ్వడం ..ముఖ్యంగా చైతన్యాన్ని అందించడం.

– స్కైబాబ

జఖ్మీ ఆవాజ్‌ నుంచి