హూం శాఖ కార్యదర్శిగా గోయల్‌ బాధ్యతలు

4

న్యూఢిల్లీ,ఫిబ్రవరి5(జనంసాక్షి): కేంద్ర ¬ంశాఖ కార్యదర్శిగా ఎల్‌.సి.గోయల్‌ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. శారదా గ్రూప్‌ సంస్థల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తులో కలగజేసుకున్నందుకు కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. గోస్వామి స్థానంలో కేరళ క్యాడర్‌కు చెందిన 1979 బ్యాచ్‌ ఐ.ఎ.ఎస్‌ అధికారి ఎల్‌.సి.గోయల్‌ను నియమించారు. అధికారి. కేంద్ర ¬ం మంత్రిత్వశాఖ కార్యాలయంలో అంతర్గత భద్రత విభాగంగా సంయుక్త కార్యదర్శిగా గోయల్‌ విధులు నిర్వహించారు. శారదా స్కాం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి మాతంగి సిన్హా అరెస్ట్‌ వ్యవహారంలో అనిల్‌ గోస్వామి జోక్యం చేసుకున్నారని… సీబీఐ.. ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) ఫిర్యాదు చేసింది. దాంతో పీఎంవో వెంటనే స్పందించి అనిల్‌ గోస్వామిని పదవి నుంచి తొలగించింది. దాంతో ఎల్‌ సీ గోయిల్‌ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు.