హెచ్.ఆర్.సి మండలాల కమిటీ ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ.
హనుమకొండ జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 11, జనంసాక్షి న్యూస్:-
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ చైర్మన్ రాజారపు ప్రతాప్ ఆదేశానుసారం హనుమకొండ జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీ, మండల & గ్రామ కమిటీల ప్రధాన కార్యవర్గాన్ని నియమించడానికి మానవ హక్కుల పరిరక్షణకై, సామజిక న్యాయం కోసం, న్యాయ పోరాటం చేయడానికి, సేవా దృక్పధం గల వారి నుండి దరఖాస్తులు కోరడం జరుగుతుంది. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు తాళ్ళపల్లి తిరుపతి మాట్లాడుతూ.. ధరఖాస్తుల పరిశీలనా అనంతరం ఉత్తర్వుల జారీ నిమిత్తం రాష్ట్ర కమిటీ కి సిఫారసు చేయడం జరుగుతుంది అని అన్నారు. జాతీయ కమిటీ నుండి గుర్తింపు కార్డులు జారీ అవుతాయి. దరఖాస్తుదారులు పూర్తి వివరాలకు 9959995782 కి ఉదయం 10 గంటల నుండి 12 గంటలలోపు దరఖాస్తు చివరి తేదీ 20 ఆగష్టు 2022. వరకు సంప్రదించగలరని తెలిపారు.