హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు
కమిషనరేట్ ఆఫ్ పోలీస్ రామగుండం పరిధిలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పించారు. బమందమర్రి సర్కిల్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ లకు గురువారం బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావుల ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన రామకృష్ణాపూర్ కానిస్టేబుల్స్ దుర్గాప్రసాద్, గిరిబాబు, రాజమౌళి, బుగ్గల సంపథ్ లను ఈ సందర్భంగా వారు అభినందించారు. పదోన్నతులు పొందినవారికి ఆర్కేపీ పోలీసులు శుభాకాంక్షలు తెలియజేసారు.