హెల్త్ కార్డుల విషయంలో అనారోగ్య పద్ధతులు వద్దు దేవీప్రసాద్
హైద్రాబాద్, అక్టోబర్29(జనంసాక్షి):
తెలంగాణ ఉద్యోగుల హెల్త్‌కార్డులపై అనారోగ్య పద్ధతులు వద్దని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ సూచించారు. సోమవారం హెల్త్‌కా ర్డుల విషయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం సోమవారం చర్చలు జరిపింది..హెల్త్‌కార్డుల మంజూరి విషయంలో ఉద్యోగ సంఘాల
అభిప్రాయాలు తెలుసుకోవడానికి చర్చలు నిర్వహించింది..ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేవరకూ హెల్త్‌కార్డు స్కీంలో చేరబోమని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినపుడల్లా సంక్షేమపథకాలు మారినట్లు ఉద్యోగుల ఆరోగ్య కార్డులు ఉండరాదని, వీటిని నిరంతరం కొనసాగేలా చూడాలని వారు కోరారు. నవంబర్1 నుండి అమలు చేస్తామని మాట ఇచ్చి, కేవలం మీటింగ్‌లతో కాలయాపన చేయడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబట్టారు. సీఎస్ పర్యవేక్షణలో హెల్త్ ట్రస్ట్ ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి కార్డుల మంజూరీకి ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రత్నకిషోర్ హామీ ఇచ్చారని ఉద్యోగులు తెలిపారు.