హైకోర్టు ఘటనపై సుప్రీం సీరియస్
హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమ కాలంలో హైకోర్టులో జరిగిన ఘటనపై సప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు కార్యకలాపాలు కొనసాగుతున్నప్పుడే ఉద్యమకారులు న్యాయమూర్తులను అడ్డుకునే ప్రయత్నం చేశారని న్యాయమూర్తులు తీవ్రంగా వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులను కోర్టులో కొట్టడం తప్పా అన్ని రకాల చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. హైకోర్టులో గొడవలు జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు చూస్తు కూర్చుందని మందలించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే హైకోర్టులను మూసివేయాల్సిందేనని వ్యాఖ్యనించింది. ఈ కేసును హైదరాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతివాదుల తరపు వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. కేసు తదుపరి వివారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది.