హైటెక్స్‌లో ముగిసిన టీటీఎఫ్ ప్రదర్శన
మాదాపూర్: హైలెక్స్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ట్రావెల్ అండ్ టూరిజం ఫేర్(టీటీఎఫ్) ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఛత్తీస్‌గడ్ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి కె.డి.పి.రావు ముఖ్యఅతిధిగా విచ్చేసి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్రబిందువన్నారు. సామాన్యులు సైతం ఆయా ప్రాంతాలను సందర్శించే విధంగా పర్యాటక ప్యాకేజీలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెయిర్‌ఫెస్ట్ మీడియా లిమిటెడ్ డైరెక్టర్ రాజీవ్ ఆగర్వాల్ తదితరులున్నారు.