హైటెక్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

92f7fc1eబెంగళూరు: ప్రపంచ కప్ మ్యాచ్ ల సందర్బంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని కావేరి నగరలో నివాసం ఉంటున్న కేశవమూర్తి (పధాన నిందితుడు), యతీష్, చేతన్, నితిన్ అనే నలుగురిని అరెస్టు చేశామని బుధవారం సీసీబీ పోలీసులు చెప్పారు. బెట్టింగ్ నిర్వహుకుల నుండి రూ. 5.50 లక్షలు, ల్యాప్ టాప్, ఎల్ సీడీలు, మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నామని సీసీబీ పోలీసులు అన్నారు. సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిక్కకల్లసంద్రలోని అపార్ట్మెంట్లో ప్రపంచ కప్ సందర్బంగా సెమి ఫైనెల్స్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించారు. ఆసీస్, ఇండియా మ్యాచ్ హీట్: హైటెక్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అర విషయం తెలుసుకున్న సీసీబీ పోలీసులు దాడి చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడానికి కేశవమూర్తి ఫ్లాన్ వేశాడు. అందుకు అపార్ట్మెంట్ సరైన స్థలం అని నిర్ణయించుకున్నాడు. వెంటనే కావేరినగరలోని ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. కేశవమూర్తి మిగిలిన ముగ్గురి సహాయంతో బెంగళూరు నగరంతో పాటు ఇతర నగరాలలో ఉన్న వారిని మొబైల్ లలో సంప్రదిస్తూ బాల్ బాల్ కు, ప్రతి ఓవర్ కు, ప్రతి వికెట్ కు ఇంత మొత్తం అంటు బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని సీసీబీ పోలీసులు చెప్పారు. గురువారం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ సందర్బంగా వీరు భారిగా బెట్టింగ్ నిర్వహించడానికి సిద్దమయ్యారని సీసీబీ పోలీసులు తెలిపారు.