హైదరాబాద్‌కు ‘చిప్‌’ తయారీ సంస్థ

4

– అమెరికాలో సంస్థ ప్రతినిధులతో కేటీఆర్‌ భేటి

సిలికాన్‌వ్యాలీ,జూన్‌ 3(జనంసాక్షి): అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సిలికాన్‌ వ్యాలీలో పర్యటించారు. సిలికాన్‌ వ్యాలీలో ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఏఎండీ ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ వీఎల్‌ఎస్‌ఐ అకాడవిూతో కలిసి చేసేందుకు ఏఎండీ సంస్థ అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపట్ల ఏఎండీ ప్రశంసలు కురిపించింది. ఏఎండీ పరిశోధనల్లో తెలంగాణలోని విద్యాసంస్థలను భాగస్వాములు చేయాలని కేటీఆర్‌కు ఏఎండీకి విన్నవించారు. కేటీఆర్‌ విన్నపానికి ఏఎండీ సంస్థ సానుకూలంగా స్పందించింది. హైదరాబాద్‌ పరిశోధన కేంద్రంలో చిప్‌ డిజైన్‌ సంస్థ ఏర్పాటుకు ఏఎండీ ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న వీఎల్‌ఎస్సై అకాడవిూలో భాగస్వాములయ్యేందుకు ఏఎండీ అంగీకరించింది. రాష్ట్ర పారిశ్రామిక, ఐటీ, ఎలక్టాన్రిక్స్‌ విధానాలను ఏఎండీకి మంత్రి వివరించారు.