హైదరాబాద్‌`చెన్నైల మధ్య విమాన సర్వీసులు


వారంలో ఐదురోజుల పాటు నడపాలని నిర్ణయం
ముంబై,ఆగస్ట్‌12(జనం సాక్షి): ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అలయెన్స్‌ ఎయిర్‌..హైదరాబాద్‌ నుంచి మరో రెండు నగరాలకు ఉదయం పూట విమాన సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 29 నుంచి హైదరాబాద్‌ నుంచి చెన్నైకి, ఆ మరుసటి రోజు హైదరాబాద్‌`బెంగళూరుల మధ్య సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఒక ప్రకటనలలో వెల్లడిరచింది. 70 సీట్ల కెపాసిటీ కలిగిన ఏటీఆర్‌ ఎయిర్‌క్రాప్ట్‌లను ఇందుకోసం వినియోగిస్తున్నది. హైదరాబాద్‌`చెన్నైల మధ్య విమాన సర్వీసు వారానికి ఐదు రోజులు నడుపనున్నది. ఉదయం 6.25 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరనున్న 9ఐ`893 విమాన సర్వీసు చెన్నైకి 8 గంటలకు చేరుకోనుండగా, తిరుగు ప్రయాణంలో 8.30 గంటలకు చెన్నైలో బయలుదేరి హైదరాబాద్‌కు 10.10 గంటలకు చేరుకోనున్నది. అలాగే హైదరాబాద్‌లో ఉదయం 6.30 గంటలకు బయలుదేరి బెంగళూరుకు 8.20 గంటలకు చేరుకోనుండగా, తిరుగు ప్రయాణంలో 8.50 గంటలకు బయలుదేరి తిరిగి హైదరాబాద్‌కు 10.20 గంటలకు చేరుకోనున్నది.