హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేసేవరకూ దేశవ్యాప్త ఆందోళన: శ్రీకాంత్
హైదరాబాద్: హైదరాబాద్ దేశానికి రెండో రాజధానిగా చేసేవరకూ దేశవ్యాప్త ఆందోళన కొనసాగిస్తామని హైదరాబాద్ బచావో బడావో ఆందోళన కన్వీనర్ తాళ్లపల్లి శ్రీకాంత్ తెలిపారు. దేశంలో 50 రాష్ట్రాలు, రెండు రాజధానుల, నినాదంతో ఉద్యమిస్తున్న సంస్థకు రెండేళ్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను రండో రాజధానిగా చెయ్యాలన్న డిమాండ్‌ను రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించారని దీనిపై కేంద్రానికి కూడా నివేదిక పంపామని చెప్పారు. దీనిపై గతంలో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశామని శ్రీకాంత్ చెప్పారు.



