హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం
పలు జిల్లాల్లూను భారీ వర్షాలు
తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం
మ్యాన్‌హోల్‌లో కొట్టుకోపోయిన టెక్కీ కోసం గాలింపు
హైదరాబాద్,సెప్టెంబర్27(జనంసాక్షి) హైదరాబాద్ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతాంలో ఏర్పడిన గులాబ్ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీరుచేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. దిల్ సుఖ్ నగర్, చైతన్య పురి, కొత్తపేట్, సరూర్ నగర్, విూర్‌పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ªూష్ట్రంలో వరుసగా రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ మణికొండ సాప్ట్‌వేర్ ఇంజినీర్ గల్లంతు ఘటనలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం 60 మందితో డీఆర్‌ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు నిర్వహించింది. శనివారం రాత్రి మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద సాప్ట్‌వేర్ ఇంజినీర్ మ్యాన్ హోల్లో పడిపోయాడు. పడిపోయిన చోట నాలా మరమ్మతు పనులు జరుగుతున్నాయి. పనులు జరిగే చోట ఎలాంటి కంచెనూ జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఏర్పాటు చేయలేదు. 36 గంటలు గడుస్తున్నా సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఆచూకీ లభించలేదు. నెక్నంపూర్ చెరువులోనూ గాలింపు కొనసాగుతోంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గులాబ్ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారింది. అది తెలంగాణ విూదుగా కేంద్రీ కృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో గంటకు 30 నుంచి 45 కిలోవిూటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడిరచింది. ఈ నేపథ్యంలో రాష్టాన్రికి రెడ్ అలర్ట్ జారీసింది. తీవ్ర వాయుగుండం, అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడిరచారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉదని హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నార్తర్న్ పవర్ డిస్టిబ్యూష్రన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు ఆదేశించారు. ప్రజలంతా విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, విద్యుత్ వైర్లు తెగిన, ఎలాంటి విద్యుత్ సంబంధిత సమస్య లకైనా సంబంధిత సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004250028, 1912కి తెలియచేయాలని కోరారు.