హైదరాబాద్‌లో భారీ వర్షం

3

– జిల్లాల్లో పంట నష్టం

– రాలిన మామిడి

హైదరాబాద్‌,మే6(జనంసాక్షి): హైదరాబాద్‌ను గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవరాం తెల్లవారుఝామున కురిసిన వర్షంతో నగరం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌ నగరం సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌, వనస్థలిపురం, సహారా ఎస్టేట్‌, మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, తార్నాక వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రామాంతపూర్‌ చర్చికాలనీలో మురుగునీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలోని పార్శిగుట్ట, చిలకలగూడ, అడ్డగుట్ట, బేగంపేట, బోయిన్‌పల్లి, అల్వాల్‌, తిరుమలగిరి ప్రాంతాల్లో భారీవర్షం పడింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, కరీంనగర్‌ జిల్లాలోని పలుమండలాల్లో భారీగా వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు భానుడి ప్రతాపానికి అల్లాడిపోయిన తెలుగు రాష్టాల్ర ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. విదర్భ నుంచి కర్ణాటక, తెలంగాణ రాయలసీమ విూదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆంధప్రదేశ్‌, తెలంగాణల్లోని పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడటంతో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోపక్క శుక్రవారం సాయంత్రం వరకు చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలియజేశారు.హైదరాబాద్‌ నగరాన్ని వరుణుడు ముంచెత్తాడు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలోని పలు చోట్ల కుండపోత వర్షం కురసింది. మియాపూర్‌, మాదాపూర్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.తెలుగుతల్లి ్గ//-లఓల్గ/వర్‌, సచివాలయం-ఇందిరాపార్కు మార్గంలో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ప్రభుత్వ ముద్రణా కార్యాలయం వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ముషీరాబాద్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, పార్శిగుట్ట, చిలకలగూడ, అడ్డగుట్ట బేగంపేట, బోయిన్‌పల్లి, ఆల్వాల్‌, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రామంతాపూర్‌ చర్చి కాలనీ, కవాడిగూడ డీఎస్‌ నగర్‌ ఇళ్లలోకి మురుగునీరు వచ్చిన చేరటంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని జోన్లు, డివిజన్ల అధికారులు, ఇంజినీరింగ్‌ సిబ్బందితో ఆయన మాట్లాడారు. తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని తక్షణం బయటకు పంపేలా చూడాలన్నారు. రహదారులపై కూలిన చెట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు.నల్గొండ జిల్లా వలిగొండ మండలంలో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి టేకులసోమారం వద్ద రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. దీంతో రేపల్లె-కాచిగూడ డెల్టా ప్యాసింజర్‌ను అధికారులు నిలిపివేశారు. మరమ్మతు అనంతరం యథావిధిగా రైలును నడిపారు.కరీంనగర్‌ జిల్లా మంథని మార్కెట్‌లో కురిసిన వర్షానికి సుమారు 1500 క్వింటాళ్ల ధాన్యం తడిచిపోయింది.ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణాజిల్లా నూజివీడు, ఆగిరిపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో మామిడికాయలు నేలరాలాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విజయవాడ, యనమలకుదురు, మైలవరం, నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. తాడేపల్లిలో ఈదురుగాలులకు ¬ర్డింగ్‌ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఒక కూలి మృతి చెందాడు. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో, చెరుకుపల్లిలో ఈదురుగాలులతో కూడదిన భారీవర్షం కారణంగా చెట్టు నేలకొరిగాయి. అలాగే తెనాలిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది బాపట్లలో ఈదురుగాలులు వీస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెంలో భారీ వర్షం కురుస్తోంది. ఏలూరులో ఈదురుగాలులు వీస్తున్నాయి. రాజమహేంద్రవరం, ఉండిలో చిరుజల్లులు పడ్డాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం, డోర్నాల, పెద్దారవీడు, తుర్లుపాడు, ఒంగోలు, చీరాల, అద్దంకి, పొదిలితో పాటు పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.నంతపురం జిల్లా పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో జల్లులు పడుతున్నాయి. ఈదురుగాలుల వల్ల పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో గురువారం రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

విదర్భ విూదుగా ఉపరితల ఆవర్తనం

ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్లో శుక్రవారం సాయంత్రం వరకు చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. విదర్భ నుంచి కర్ణాటక, తెలంగాణ, రాయలసీమల విూదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో వర్షాలకు అవకాశం ఏర్పడిందన్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతల తీవ్రత కూడా తగ్గిందని వెల్లడించారు. గురువారం రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి మరో రెండుమూడు రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో  పలుచోట్ల వర్షం కురిసింది. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడ్డాయి. పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల పరిధిలో ఒక మోస్తరు వర్షం కురిసింది. కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో వర్షం పడింది. దీనికితోడు గురువారం సాయంత్రం వరకు తీవ్రంగా ఎండ మండించింది. ఎండ తీవ్రతకూ, వడదెబ్బకూ గురై రాష్ట్రవ్యాప్తంగా మరో తొమ్మిది మంది బలయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఇద్దరు, విజయనగరం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు వృద్ధులు, ముగ్గురు మహిళలు, ఒక ఉపాధి హావిూ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉన్నారు. తెలంగాణలో అకాల వర్షాలు… అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ నష్టాల కారణంగా రైతన్నలు లబోదిబోమంటున్నారు. పంట చేతికొచ్చే దశలో కొట్టుకుపోవడం జీర్ణించుకోలేక పోతున్నారు. కల్లాల్లో ఉన్న పంట కూడా ఊడ్చుకుపెట్టుకుని పోయింది.  ఆదిలాబాద, నిజామాబాద్‌,కరీంనగర్‌,వరంగల్‌  జిల్లాల్లో గత రెండురోజులుగా కురిసిన  వాన అన్నదాతకు కన్నీరే మిగిల్చింది. చేతికి అందివచ్చిన పంట నీటి పాలైంది. గత నాలుగైదు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులలతో కూడిన వర్షానికి మామిడి కాయలు రాలిపోయాయి. పగలు ఎండ, సాయంత్రం అయ్యేసరికి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో వడగళ్లతో వాన కురిసింది. ఈ అకాల వర్షాలు అన్నదాతకు నష్టాలే మిగిల్చాయి. పొలాల్లో పంట నీటిపాలైంది. రైతులను కోలుకోని దెబ్బతీశాయి. నిజామాబాద్‌ జిల్లాలో అకాల వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. మామిడి పంట నేలరాలింది. అకాల వర్షాలు  వరంగల్‌ జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ది. మామిడి తోటలకు అపార నష్టం జరిగింది. చేతికి వచ్చిన పంట నేలపాలవ్వడంతో అన్నదాత కన్నీరు మున్నీరు అవుతున్నాడు.