హైదరాబాద్‌లో మరో మహాదిగ్గజం
– ఆపిల్ మాప్స్ కేంద్రం ఏర్పాటు
– తెలంగాణకు గర్వ కారణం
– ముఖ్యమంత్రి కేసీఆర్
– నాలుగువేల ఉద్యోగాలు ఇస్తాం
– ఆపిల్ సీఈవో టిమ్‌కుక్
హైదరాబాద్,మే19(జనంసాక్షి): హైదరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆపిల్ మ్యాప్స్ కేంద్రం ఏర్పాటు తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆపిల్ మ్యాప్ కేంద్రం ద్వారా వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయని,దీంతో నిరుద్యోగులకు హావిూ దక్కనుందని సీఎం కెసిఆర్ పేర్కొన్నారు. వేవ్‌రాక్ భవనంలో ఆపిల్ సంస్థ సీఈవో టిమ్‌కుక్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆపిల్ సంస్థ నూతన కార్యాలయం ప్రారంభంతో పాటు ఐటీ అంశాలపై చర్చించారు. యాపిల్ తమ కార్యాలయంకోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఆనందంగా ఉందని చంద్రశేఖర రావు అన్నారు. భారత్‌లో తొలిసారిగా పర్యటిస్తున్న యాపిల్ అధినేత టిమ్‌కుక్.. గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో యాపిల్ మ్యాప్స్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా 4వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అమెరికా వెలుపల యాపిల్ సంస్థ తన సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాన్ని తొలిసారిగా హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేయడం విశేషం. హైదరాబాద్‌లో యాపిల్ మ్యాప్స్ కేంద్రం ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. యాపిల్ మ్యాప్ కేంద్రం ద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది వేలమందికి ఉద్యోగాలు కల్పించ నుందన్నారు. తమ ప్రభుత్వం అనుసరించిన ప్రోయాక్టివ్ విధానానికి ఇది తార్కాణమని సీఎం అన్నారు. ప్రపంచంలో అత్యంత వినూత్నమైన కంపెనీల్లో యాపిల్ కూడా ఒకటని, ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం కావడం చాలా గర్వంగా ఉందని ఆర్‌ఎంఎస్‌ఐ సీఈవో అనూప్ జిందాల్ అన్నారు ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ కంప్యూటర్లు, ఆపిల్ వాచ్‌ల మ్యాప్‌ల అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రం కానుంది. నాలుగు వేల మందికి ఆపిల్ హైదరాబాద్ సంస్థలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే పరోక్షంగా అనేకమందికి ఉపాధి దక్కనుంది. ఉదయం హైదరాబాద్ ఏరుకున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆపిల్ సంస్థ సీఈవో టిమ్‌కుక్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆపిల్ సంస్థ నూతన కార్యాలయం ప్రారంభంతో పాటు ఐటీ అంశాలపై చర్చించారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి టిమ్ కుక్ బృందం నేరుగా నానక్ రామ్ గూడా చేరుకున్నారు. అక్కడ వేవ్ రాక్ బిల్డింగ్ లోని ఆపిల్ కార్యాలయంలో డిజిటల్ మాపింగ్ కేంద్రాన్ని టిమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఉత్పత్తులైన ఐ ఫోన్, ఐ ప్యాడ్, మ్యాక్, వాచ్ లపై దృష్టిపెట్టనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ లో తమ కొత్త కార్యాలయం ప్రారంభించడం చాలా థ్రిల్లింగా ఉందని కుక్ తెలిపారు. హైదరాబాద్‌లో తమ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కేంద్రం ద్వారా త్వరలోనే యూనివర్శిటీలు, భాగస్వాములతో తమ సేవలను విస్తరిస్తామన్నారు. అయితే దీనికి సంబంధించిన పెట్టుబడుల వివరాలను మాత్రం టిమ్ వెల్లడించలేదు. ఈ కేంద్రంలో తొలుత 150 మంది నిపుణులు పనిచేయనున్నారు.దీనిద్వారా సుమారు 4 వేలమంది ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. ఇక్కడ అపారమైన ప్రతిభగల నిపుణులు ఉన్నారని, వారితో సంబంధాలను విస్తరించడంకోసం ప్రయత్నిస్తామన్నారు. హైదరాబాద్ క్యాంపస్‌లో 4వేల ఉద్యోగాలు ఇస్తామని కుక్ ప్రకటించారు. కాగా, గురువారం నాడు ఒక బిగ్ న్యూస్ చెబుతానని, అది అప్పటివరకు సస్పెన్స్ అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. ఆయన చెప్పదలచుకున్న బిగ్ న్యూస్ ఇదే కావచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి 4 వేల ఐటీ ఉద్యోగాలు.. అది కూడా కేవలం హైదరాబాద్ క్యాంపస్‌లోనే అంటే అది నిజంగా బిగ్ న్యూసేనని అంటున్నారు. విమర్శలుచేస్తున్న రాష్ట్ర బిజెపి నాయకులకు దమ్ముంటే ఏదైనా ఓ జాతీయ ప్రాఎక్ట్ సాధించాలని సిఎం కెసిఆర్ గట్టిగా హెచ్చిరించారు. కొత్త బిచ్చగాడికి పొద్దెరుగదన్న రీతిలో విమర్శలు చేయడం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొత్తగా వచ్చిన కే లక్ష్మణ్‌పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. పనిచేస్తోన్న తమ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్రం ఖర్చు చేయడంలేదని మాట్లాడిన విషయంపై మండిపడుతూ ఏయే పథక్‌ఆలకు ఎంతెంత నిధులు ఇచ్చిందీ, దానిని దేనికి కఱ్చు చేసిందీ వివరించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడనే చందంగా మాట్లాడటం సరికాదన్నారు. లక్ష్మన్ అజ్ఞానికి చింతిస్తున్నానన్నారు. తెలంగాణభవన్‌లో సిఎం కెసిఆర్ విలేకరులతో మాట్లాడారు. మనకు కరువు నివారణకు రూ.3 వేల కోట్లు కావాలని కోరితే ఇచ్చింది రూ.7 వందల కోట్లని తెలిపారు. తాను మొన్న ఢిల్లీ వెళ్లినపుడు స్వయంగా ఈ విషయాన్నే ప్రధానికి చెప్పానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రంకన్నా అన్ని విషయాల్లో ముందున్నామని అన్నారు. సీలింగ్‌లేకుండా ఇంటిలో ప్రతీ ఒక్కరికి కిలో రూపాయికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్నామని వివరించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, లక్ష్మన్ తెలంగాణకు ఏదైనా చేయాలనుకుంటే ఒక జాతీయ¬దా ప్రాజెక్టును తీసుకురావాలని సవాలు విసిరారు. దీంతో తెలంగాణలో శాశ్వత కరువు నివారణ అవుతుందని అన్నారు. అందరూ తామే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయమని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరు ప్రత్యామ్నయమో ప్రజలు చెబుతారని తెలిపారు. 2019లో బిజెపి అధికారంలోకి వస్తుందని లక్ష్మణెళ్చిసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇక చంద్రబాబు ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపైనా అసమనం వ్యక్తం చేశారు. విభజన సందర్భంగా 60వేల కోట్ల ఆదాయం ఉన్న హైదరాబాద్‌ను కోల్పోయామని బాబు చేసిన ప్రకటన
ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. వాణిజ్యపన్నలు ద్వారా హైదరాబాద్‌లో తమ టార్గెట్ 43వేల కోట్లు మాత్రమేనని అన్నారు. ఇది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో ఏమొచ్చిందని విపక్షాలు చేస్తున్న విమర్శలపైనా సిఎం గాటుగా స్పందించారు. ఆపిల్ సంస్త ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతోందని అన్నారు. గూగుల్ కూడా ఇక్కడ పెట్టుబడులకు సిద్దంగా ఉందన్నారు. తమ పారిశ్రామిక విధానం ప్రజలు, అంతర్జాతీయ సమాజం మెచ్‌ంచిందని అన్నారు. 17వేలకు పైగా అనుమతలును పారదర్శకంగా ఇచ్చామన్నారు. తెలంగాణ అభివృద్దిలో ముందుందన్నారు. బెంగుళూరు స్థానాన్ని మనం ఓవర్ టేక్ చేశామని అన్నారు. ఇవన్నీ విపక్షాలకు కనిపించవా అని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు ఎక్కడా పనిపాటలేదని, తెలంగాణపై అసత్య ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని సీఎంవిమర్శించారు. హైదరాబాద్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మొన్న రూ.60 వేల కోట్లు వచ్చే హైదరాబాద్‌ను వదులుకున్నామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. గతంలో సీఎంగా పనిచేసి ప్రస్తుతం ఒక రాష్టాన్రికి ముఖ్యమంత్రిగా పనిచేస్తోన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నిజాలు మాట్లాడేవారుంటే వారిని ప్రజలే ఆదరిస్తారని తెలిపారు. గుజరాత్‌లో నరేంద్రమోదీని ప్రజలు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా గెలిపించారో అందరికి తెలుసన్నారు. నవీన్ పట్నాయక్ ఒడిశా రాష్టాన్రికి నాలుగుసార్లు సీఎంగా ఎన్నికయ్యారు. మమతా దీదీ రెండోసారి అఖండ విజయం సాధించిందని తెలిపారు. తమిళనాట జయ మరోమారు పీఠం ఎక్కబోతున్నారని అన్నారు. మంచిగ పనిచేస్తే ప్రజలే గుండెలకు హత్తుకుంటారనేందుకు ఇవే నిదర్శనాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా గత రెండేళ్ల నుంచి టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఏకపక్షంగా గెలిపిస్తోన్నారని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపుడు అవినీతి పనులు చేసిందెవరో ప్రజలకు తెలుసన్నారు. అవన్నీ మరిచిపోయి టీఆర్‌ఎస్‌పై అవాకులుచెవాకులు పేలడం సరికాదన్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు ప్రజల ముందు అపహాస్యంపాలు కాకుండా చూసుకోవాలని హితవు పలికారు.