హైదరాబాద్‌లో మరో 32 బస్తీ దవాఖానాలు

హైదరాబాద్‌,అక్టోబర్‌28  (జనంసాక్షి): హైదరాబాద్‌ మహానగరంలో మరిన్ని బస్తీ దవాఖానాలు అందుబాటు లోకి రానున్నాయి. నగరంలో ఇప్పటికే 226 బస్తీ దవాఖానాలు ఉండగా, త్వరలో మరో 32 ప్రారంభించ నున్నట్టు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. దవాఖానాల్లో చికిత్సతో పాటు పరీక్షలు చేసేందుకు నమూనాలు సేకరించి ఐపీఎం, ఫీవర్‌, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు పంపుతారు. అక్కడి నుంచి రిపోర్టులు తెప్పించి రోగులకు అందజేయనున్నారు. ఇప్పట్టికే పలు ప్రాంతాల్లో దవాఖానాలు ప్రారంభించారు.