హైదరాబాద్‌ అసెంబ్లీ ముందు కారుదగ్ధం

హైదరాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌లోని అసెంబ్లీ చౌరస్తాలో శనివారం ఉదయం ఓ కారు మంటల్లో దగ్ధమయ్యింది. ఏపీ 29 క్యూ 6441 నంబరు గల శాంత్రో కారు లక్డీ కపూల్‌ చౌరస్తాలో ఓ బంక్‌లో పెట్రోల్‌ పోయించి యూటర్న్‌ చేస్తుండగా అకస్మాత్తుగా కారు నుంచి మంటలు వచ్చాయి. గమనించిన మరో కారు డ్రైవర్‌ అతడిని అప్రమత్తం చేశాడు. వెంటనే డ్రైవర్‌ కారు నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే మంటలు వ్యాపించి కారు దగ్ధమయ్యింది.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. దీంతో ఎవరికి కూడా ప్రమాదం కాలేదు. ఉదయంపూట కావడంతో పెద్ద పూ/-రమాదం తప్పింది.
పాతబస్తీలో ఆరు బైక్‌లకు నిప్పు
టప్పాచబుత్రా పోలీసు స్టేషన్‌ పరిధిలో కొంతమంది దుండగులు రెచ్చిపోయారు. అమలాపూర్‌లో అర్ధరాత్రి 6 బైక్‌లకు దుండగులు నిప్పు పెట్టారు. వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. బైక్‌ల యజమానులు టప్పాచబుత్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.