హైదరాబాద్ జిల్లా తెదేపా అధ్యక్షుడిగా తలసాని
హిమయత్‌నగర్: హైదరాబాద్ జిల్లా తెదేపా అధ్యక్షుడిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరును అధిష్ఠానం ప్రకటించింది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా పాదయాత్రలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తలసానిని పిలిపించుకున్నారు. అరగంట పాటు చర్చించిన తర్వాత నగరానికి చెందిన ముఖ్యనాయకులు మాజీమంత్రి కె. విజయారామారావు, మాజీ మేయర్ తీగెల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి. సాయన్న తదితరులను పిలిపించి చర్చించారు. అనంతరం తలసాని యాదవ్ పేరును ప్రకటించారు.