హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీకి స్వైన్‌ఫ్లూ

2

9 మంది ఐపీఎస్‌ ట్రైనీలకు రోగనిర్ధారణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22(జనంసాక్షి): రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గినా స్వైన్‌ఫ్లూ వైరస్‌మాత్రం తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ స్వైన్‌ఫ్లూ దెబ్బకు సామాన్యులే బలవగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో జాతీయ పోలీసు అకాడవిూకి వ్యాపించింది. అకాడవిూలో ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న 917 మంది రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. వీరిలో 9 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వారిని స్థానిక ఆస్పత్రులలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ కారణంగా అధికారులు అకాడవిూలో శిక్షణను తాత్కాలికంగా నిలిపివేశారు.