హైదరాబాద్ కు తరలించిన పిటిజి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలను యధా స్థానంలో మన్ననూర్ లో నిర్వహించాలి.

 

శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టిన అచ్చంపేట ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు రమావత్ సంతోష్ నాయక్అచ్చంపేట ఆర్సి 28 జూలై (జనం సాక్షి న్యూస్) ;-

 

నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు లో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై గురువారం నాడు మననూర్ నుండి హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ కు తరలించిన పిటిజి ఎక్సలెన్స్ ఆఫ్ కాలేజీని తిరిగి ఏర్పాటు చేయాలని ఎన్ ఎస్ యు ఐ అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షుడు రామవత్ సంతోష్ నాయక్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….నల్లమల ప్రాంతంలో వెనుకబడిన పేద గిరిజన ప్రజల బిడ్డలు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువు కోలేరని ,ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా గిరిజన బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే గా ఉండి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మన్ననూరులో పి టి జి పాఠశాల ను కళాశాల గా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మననూర్ లో ఉన్న పీటీజి ఎక్సెలెంట్స్ ఆఫ్ కాలే జి హైదరాబాదులోని రాజేందర్ నగర్ కు తరలించిన పట్టించుకోలేదన్నారు. అతని అసమర్థత వలనే మన ప్రాంతం నుండి కళాశాలలు వేరే ప్రాంతానికి తరలిపోతున్నాయని దానివల్ల పేద ఆదివా సి విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని అన్నారు. తక్షణమే యధా స్థానంలో పిటిజి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలను కొనసాగించాలని కోరారు. అనంతరం ఐటీడీఏ పీవో కు వినతిపత్రం అందజేశారు కార్యక్రమంలో ఎన్ ఎస్ వి ఐ నాయకులు విద్యార్థులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.