హోంగార్డులకు కష్టం రాకుండా చూసుకుంటాం

– కేంద్రం సహకరించకపోయినా పథకాలను అమలు చేస్తున్నాం
– ఆర్థిక వ్యవస్థ సహకరిస్తే మొదటి న్యాయం చేసేది హోంగార్డులకే
– మహిళలపై హత్యాచారాలను అరికట్టాలి
– రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది
– ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
– చంద్రబాబును సన్మానించిన హోంగార్డులు
అమరావతి, జులై2(జ‌నం సాక్షి) : హోంగార్డులకు పోలీసులకు వ్యత్యాసమే లేదని, ¬ంగార్డులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామని, వారి ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.హోంగార్డులకు రోజువారి అందించే దినసరి భత్యాన్ని రూ.400 నుంచి రూ.600కు, నెలకు రూ.18వేల జీతం ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సీఎం చంద్రబాబుకు ¬ంగార్డుల సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఇది సన్మాన సభ కాదు… ¬ం గార్డుల చైతన్య సభగా అభివర్ణించారు. హోంగార్డులు ప్రజలను చక్కగా చూసుకోవాలని, ¬ం గార్డులను చక్కగా చూసుకునే బాధ్యత నాది అని చంద్రబాబు హావిూఇచ్చారు. సమస్య ఎక్కడుంటే అక్కడ హోం గార్డులుంటాని ప్రసంశించారు. కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించకున్నా… అందరి సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తున్నామని.. ఆర్ధికంగా ఏమాత్రం వెసులుబాటు కలిగినా… మొట్ట మొదట ఆదుకునేది ¬ం గార్డులలేనని చంద్రబాబు హావిూ ఇచ్చారు. వివిధ శాఖల్లో పని చేసే క్షేత్రస్థాయి సిబ్బందికి గణనీయంగా వేతనాలు పెంచామని చంద్రబాబు తెలిపారు. నెలలో రెండు రోజుల పాటు పెయిడ్‌ హాలిడేస్‌ ఇచ్చామన్నారు. ఇక హోంగార్డులకు గృహవసతి ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హావిూని నిలబెట్టుకున్నానని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలోనూ ¬ం గార్డులకు ఇన్ని వసతులులేవని గుర్తు చేసిన ఆయన… అభివృద్ధి కంటే శాంతి భద్రతలు ముఖ్యం అన్నారు. తీవ్రవాదం, ముఠా కక్షలు, రౌడీయిజం, మత అల్లర్లు చాలా వరకు అరికట్టామని వెల్లడించిన బాబు.. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత పోలీసుల పైనే ఉందన్నారు. కమ్యూనిటీ పోలీసింగును పెంచాలని సూచించారు. కొందరు స్వచ్ఛంధంగా సహకరించేందుకు సిద్ధంగా ఉంటారని, వారి సేవలను వివియోగించుకోవాలని సూచించారు. పోలీస్‌ డ్యూటీస్‌ ఏంటో.. వారి బాధ్యతలేంటో విద్యార్ధులకు వివరించాలని… పోలీస్‌ విధుల్లో విద్యార్ధులను భాగస్వాములను చేయాలని సీఎం సూచించారు. మంచి వాళ్లకు మంచిగా ఉండాలి… రౌడీల గుండెల్లో నిద్రపోవాలన్నారు. నెలవారీ కైమ్ర్‌ బులెటిన్లు విడుదల చేసే పద్ధతిని ప్రవేశ పెట్టాలని పోలీస్‌ అధికారులను సూచించిన ఏపీ సీఎం… స్టేషన్ల వారీగా నెలవారీ కైమ్ర్‌ బులెటిన్లను విడుదల చేయాలన్నారు. మహిళలపై అరాచకాలను అరికట్టాలని, మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రశాంతత ఉంటేనే పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధి ఉంటుందని చంద్రబాబు అన్నారు. హోంగార్డుల కష్టాలు గుర్తించి గౌరవవేతనం పెంచారని డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ¬ంగార్డులు తీవ్రంగా కష్టపడుతున్నారని తెలిపారు. పోలీసులు, హోంగార్డులు సమానంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అంతా ఓ కుటుంబంగా పనిచేస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. సీఎం విజన్‌కు అనుగుణంగా పోలీసులు పనిచేస్తారని హావిూ ఇస్తున్నామన్నారు. టెక్నాలజీ వినియోగంలో ¬ంగార్డులకు శిక్షణ ఇస్తామని, హోంగార్డుల సమస్యలు ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్తానని డీజీపీ పేర్కొన్నారు.