హోరా హోరీగా కొనసాగిన క్రికెట్ పోటీలు…

 

 

 

 

 

 

ఇల్లందు సెప్టెంబర్ 3 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో క్రీడా దినోత్సవం సందర్భంగా ఇల్లందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రెస్ క్లబ్ జట్లు పోటీ పడగా ఫైనల్కు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ,మున్సిపల్ డిపార్ట్మెంట్ చేరాయి. వర్షం కారణంగా రద్దయిన ఫైనల్ మ్యాచ్ ఈరోజు ఉదయం నిర్వహించగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ణీత 10 ఓవర్లలో 61 పరుగులు చేసింది. 62 పరుగుల లక్ష్య చేదనలో దిగిన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ 7 ఓవర్లలోనే లక్ష చేదను ఛేదించి విజయం సాధించింది. అనంతరం విజేతలకు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ అంకు షావలి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ ఏఈ శంకర్ , ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అధికారులు ప్రెస్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.