హోర్డింగ్‌ యజమానుల నిర్లక్ష్యంపై కేసులు నమోదు

2

– మంత్రి తలసాని, మేయర్‌ బొంతు రామ్మోహన్‌

హైదరాబాద్‌,మే21(జనంసాక్షి):  గాలి దుమారంతో కూడిన భారీ వర్షానికి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో వద్ద నెక్సాషోరూం ముందు కుప్పకూలిన యూనిపోల్‌ ¬ర్డింగ్‌ యజమానితో పాటు కాంట్రాక్టర్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం భారీ వర్షానికి ఈ షోరూం ముందు ఏర్పాటు చేసిన ¬ర్డింగు కుప్పకూలడంతో పది వాహనాలు ధ్వంసమయ్యాయి. తాను పని నిమిత్తం తన ఇన్నోవా ఏపీ 09 సీటీ 7776లో వచ్చి పార్కింగ్‌ చేసి షోరూంలోకి వెళ్లానని కొద్దిసేపటికీ ¬ర్డింగ్‌ కూలి తన వాహనం నుజ్జునుజ్జైందని ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ కారు యజమాని ఆదిత్య జైన్‌ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూనిపోల్‌ ¬ర్డింగ్‌ ప్రకాశ్‌ ఆర్ట్స్‌ యజమానిపై ఐపీసీ సెక్షన్‌ 336 కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా కుప్పకూలిన ¬ర్డింగ్‌ను గ్యాస్‌కట్టర్లు, క్రేన్ల సహాయంతో శుక్రవారం రాత్రి నుంచి తొలగింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి పూర్తిగా విరిగిన ¬ర్డింగ్‌ సామాగ్రి, వాహనాలను తరలించారు.  జీహెచ్‌ఎంసీ అధికారులు, ¬ర్డింగ్‌ ఏజెన్సీల నిర్వాహకులు అక్రమ ¬ర్డింగ్‌లను వెంటనే తొలగించాలని మంత్రి తలసాని శ్రీనివాసరావు హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీలో ¬ర్డింగ్‌లపై మంత్రి తలసాని సవిూక్ష నిర్వహించారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలు పాటించని యూనిక్‌ ¬ర్డింగ్‌లను వెంటనే తొలగించాలన్నారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, అధికారులు హాజరైనారు. విపత్తుల నివారణకు సాంకేతి పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. నగరంలో 150 కి.విూ వేగంతో ఈదురుగాలులు, వర్షం కుసిందని, సకాలంలో రెస్క్యూ బృందాలను రంగంలోకి దించామని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించాలని కోరారు. రానున్నకాలంలో మరింత అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని మంత్రి తెలిపారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.  వివిధ విభాగాలతో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. నిన్న ప్రజల నుంచి 420 ఫిర్యాదులు అందాయని, ఫిర్యాదుల పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి చెప్పారు.గాలి తీవ్రతకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 600 కరెంటు స్తంభాల్లో 300 నేలకూలాయని వారు తెలిపారు. గతరాత్రి నుంచేమొదలైన సహాయక చర్యలను శనివారం మరింత ముమ్మరం చేశారు. చెట్లను తొలగిస్తూ, ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చేశారు.  వీటితోపాటు భారీ ¬ర్డింగులు లెక్కలేనన్ని పడిపోయాయన్నారు. నగరంలో 245 వరకు ఉన్న 11కేవీ ఫీడర్స్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని మంత్రి తలసాని, మేయర్‌ బొతంఉ పేర్కొన్నారు. రాత్రి 1.45 గంటల కల్లా 205 ఫీడర్లలో అధికారులు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించగలిగారని చెప్పారు. మొత్తం 1500 మంది సిబ్బంది, అధికారులు ఈ పనుల్లో పాల్గొన్నారన్నారు. తెల్లవారుజామున 3గంటల వరకు తాను, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి పర్యవేక్షించారని చెప్పారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వాటిని కూడా అధికారులు ముమ్మరం చేశారని తెలిపారు. అయితే, నగరంలో ఏర్పాటు చేసిన ¬ర్డింగులకు గంటకు 50 కిలోవిూటర్ల వేగంతో వీచే గాలులను మాత్రమే తట్టుకునేట్లు ఏర్పాటు చేశారని, కానీ, 95 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీయటంతో తట్టుకోలేక అవి పడిపోయాయని వారు వివరించారు. గాలి వాన ఆగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించటంతో చాలా వరకు సమస్యలను దూరం చేయగలిగామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌

చెప్పారు. గతరాత్రి  నగరంలోని బంజారాహిల్‌స్లో శుక్రవారం సాయంత్రం 100 కి.విూ వేగంతో గాలులు వీచాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ… గాలి వాన బీభత్సానికి 300 చెట్లు నేలకొరిగాయని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయం తీసుకున్నామన్నారు. అలాగే ట్రాఫిక్‌ను  పునరుద్ధరించామని తెలిపారు. ఈ గాలివానకు ఇద్దరు చనిపోయారని… మరికొందరికి గాయాలయ్యాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌  పేర్కొన్నారు.