●కాంగ్రెస్ దిక్కులేని పార్టీ అయింది

 

 

 

 

●ఎండ్రికిచ్చలు ఎంతో కాంగ్రెస్ నాయకులు అంత ●ఎండ్రికిచ్చలు ఎంతో కాంగ్రెస్ నాయకులు అంత●తెలంగాణ మినహా దేశంలో అన్ని రాష్ట్రాలు చీకటిమయం●మునుగోడు ప్రజల బిజెపికి తాకట్టు పెట్టిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ● కాంగ్రెస్,బిజెపి పాలిత రాష్ట్రాలలో పెన్షన్ 600లే● ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరచిన మోడీ ●దేశా న్ని మోడీ నుండి విముక్తి చేసేది కేసీఆరే ●టిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్ రెడ్డి
మునుగోడు సెప్టెంబర్ 13(జనంసాక్షి):
ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలిస్తే రైతుల మోటార్లకు మీటర్లు తప్పదాని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలాజీ కాటన్ మిల్ లో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలోకాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో దిక్కులేని పార్టీగా మిగిలిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండ్రికిచ్చలు లాగా వ్యవహరిస్తున్నారన్నారు.తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతుందని, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఆరు గంటల విద్యుత్ అందుతుందని  అది కూడా డబ్బులు చెల్లిస్తేనే ఇస్తున్నారన్నారు. డబ్బులు చెల్లించని రైతుని వెంటనే విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు 2000 రూపాయల పెన్షన్ అందుతుందని, మిగతా రాష్ట్రాలలో పెన్షన్ 600లే ఆ ప్రభుత్వాలు అందిస్తున్నాయన్నారు. మోడీని గెలిపిస్తే నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తానని చెప్పి నేటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. దేశంలో నియంత, అవినీతి పాలన అందిస్తున్న నరేంద్ర మోడీ నుండి ప్రజలను విముక్తి చేయడం కేసీఆర్ కే సాధ్యమన్నారు. దేశ  రాజకీయాల్లో కేసిఆర్   అడుగుపెడితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి మయంగా మారుతాయన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఈ ప్రాంతంలోని ప్రతి వ్యవసాయం మోటార్ కు  మీటర్ వస్తుందన్నారు. 60 ఏళ్ల పాలనలో రెండు లక్షల మందికి ఫ్లోరైడ్ బారిన పడ్డారని ఈసారి కూడా ఇస్తే మరో లక్ష మంది కాళ్లు, చేతులు వంకరపోయి అంగవైకల్యం పొందుతారన్నారు. మోడీ అధికారంలోకి రాకముందు  గ్యాస్ సిలిండర్ ధర 380 ఉంటే ఇప్పుడు 1150 అయిందని, పెట్రోలు రెండింతలు పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బండ పురుషోత్తం రెడ్డి, మాజీ జడ్పిటిసి జాజుల అంజయ్య గౌడ్, ఎంపీటీసీలు బొడ్డు శ్రావణి నాగరాజుగౌడ్, ఈద నిర్మల శరత్, సర్పంచ్ రాష్ట్ర కార్యదర్శి గుర్రం సత్యం, నాయకులు పగిళ్ల సతీష్, తదితరులు పాల్గొన్నారు.