01పి , మాట్లాడుతున్న కన్నా పరుశురాములు
చేయి చేయి కలుపుదాం జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం
… జిల్లా గవర్నర్ ఎలెక్టు లయన్ కన్నా పరశురములు
స్టేషన్ ఘన్పూర్, జూన్ 07, ( జనం సాక్షి ), చేయి చేయి కలిపి జిల్లాను అగ్రగామిగా నిలిపాలని లయన్స్ జిల్లా గవర్నర్ ఎలెక్టు లయన్ కన్నా పరశురములు అన్నారు. 2022, 23 లయనిస్టిక్ సంవత్సరం జిల్లా క్యాబినెట్ లో నలుగురికి అవ కాశం కల్పించడం జరిగిందని అన్నారు. జిల్లా క్యాబినెట్ కార్యదర్శిగా నాగబండి రవీందర్ ను, జిల్లా క్యాబినెట్ కోశాధికారిగా అల్లాడి ప్రభాకర్ రావు ను, జిల్లా అడ్మినిస్ట్రేటర్గా చంద్రగిరి ప్రసాద్ ను జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ గా కుర్రెముల్ల యాదగి రి గౌడ్ ను నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.