01పి, మాట్లాడుతున్న లకావత్ చిరంజీవి

అగ్నిపథ్ పథకం కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం
… టిఆర్ఎస్వి నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి నాయక్
స్టేషన్ ఘన్పూర్, జూన్ 24, ( జనం సాక్షి) :
అగ్నిపథ్ పథకం కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం అనిటిఆర్ఎస్వి నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి నాయక్ అన్నారు. మండల కేంద్రంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం  ఆర్మీ , నేవి, వివిధ విభాగాలలో  నిరుద్యోగ యువత కోసం  అగ్నిపథ్ పథకాన్ని  కొత్తగా తీసుకోరావడం వల్ల  దేశంలోని  సైన్యంలో చేరాలనుకునే యువత  అయోమయానికి గురవుతున్నారని, అగ్నిపథ్ పథకం కేంద్ర ప్రభు త్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని  తెలం గాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం టిఆర్ఎస్వి  స్టేషన్ ఘనపూర్  నియోజకవర్గ లకావత్ చిరంజీ వి నాయక్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుం డా, దేశ భవిష్యత్తుకు అదే విధంగా భారత ఆర్మీ  వ్యవస్థను నాశనము చేసే విధంగా అగ్నిపథ్ ఉందని ఆ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని,  పథకంపై దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత చేస్తు న్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి మోడీ పూర్తిగా బాధ్యత వహించాలని అన్నారు.  భారత సైన్యంలో  నియామకాలు చేపట్టాలని అగ్నిపథ్ పథకం వలన దేశ భవిష్యత్తు భద్రతకు  ముప్పు వాటిల్లి యువతకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈపథకం వల్ల సైనికులను నాలు గు సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతి  ఉద్యోగులు గా మార్చారాని, ఆ తరువాత వారి భవిష్యత్ ఏం కావాలని డిమాండ్ చేశారు. దేశ భద్రత సైన్యాన్ని కాంట్రాక్టుకు ఇచ్చి నిరుద్యోగుల జీవితాలతో చెల గాటం ఆడుతున్నారని,  కేంద్రంలో మోడీ ప్రభు త్వం దేశాన్ని అగ్ని గుండంలా మార్చిందని  నాలు గేళ్ల తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో సైనికులం చేయ డం వల్ల వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచడం సాధ్యం కాదని, సాయుధ బలగాలలోకి రెగ్యులర్   రిక్రూమెంట్  వెంటనే చేపట్టాలని కోరారు.  చారిత్రాత్మకంగా చూస్తే సైన్యంలో ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీల కుటుంబాల నుండి అధికంగా ఉన్నారని వీరు సామాజిక భద్రత కల్పించే ఉపాధిని కోల్పో తారనే భయం యువకులలో ఉందని అన్నారు.  దేశ సేవ చేయాలని యువకులు ఆర్మీలో చేరేందు కు ముందుకు వచ్చి తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని తెలిపారు.  75 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తరువాత 75 ఏళ్ల లో ఏ ప్రభుత్వం ఎన్న డూ లేని విధంగా ఆర్మీ లో కాంట్రాక్టు పద్ధతిలో   ఉద్యోగాలకు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోవ డం దారుణం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ వ్యవస్ధను వ్యాపార సంస్థగా మారుస్తుందని ఇదే ఆర్మీ, నిరుద్యోగులకు  ఆగ్రహానికి గురికావలసి తప్పదని, సైన్యంలో తాత్కాలిక నియామకాల్లో దేశ భద్రతకే ముప్పని  అగ్నిపథ్ లో ప్రయోజనాల కన్నా ప్రమాదం ఎక్కువ అన్నారు.  కాంట్రాక్టు పద్ధతిలో సైనికుల రిక్రూట్మెంట్ రద్దు చేయాలని అన్నారు.  కాల్పుల్లో మృతి చెందిన నర్సంపేట కు చెందిన దామెర రాకేష్ కుటుంబానికి కేంద్ర ప్రభు త్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా,   ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో టిఆర్ఎస్వి మండల ఇంచార్జి పిట్టల అనిల్ కుమార్, అధ్యక్షుడు బొంకురి మహేష్, మాచర్ల భానుప్రకాశ్ , మురళి కృష్ణ, పిట్టల అజ య్, తోట వేణు, భూక్యా రవిందర్,  భూక్యా సురేష్, తదితరులు పాల్గొన్నారు.